CM Revanth ON Tourism Conclave: పర్యాటక రంగం డెవలప్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:47 PM
పర్యాటక రంగం డెవలప్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ శనివారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగం డెవలప్‌మెంట్ (Tourism Sector Development)పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దృష్టి సారించింది. ఇందులో భాగంగా శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ (Tourism Conclave) రేపు (శనివారం) జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు. టూరిజం కాంక్లేవ్ ద్వారా పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. హుస్సేన్ సాగర్‌లో డబుల్ డెక్కర్ బోట్‌ను ‘ముచుకుందా’ పేరుతో సీఎం రేవంత్ రేపు ప్రారంభించనున్నారు. టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, వెల్‌నెస్ సెంటర్లు, రిసార్టులు, ఫైవ్‌స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఇకపై సినిమా షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో అనుమతులు ఇవ్వనుంది. మెడికల్ వాల్యూ టూరిజం పోర్టల్ ప్రారంభించనుంది. అలాగే ప్రపంచం నలుమూలాల నుంచి పేషెంట్లకు సౌకర్యం కల్పించనుంది. తెలంగాణలో హెలికాఫ్టర్ టూరిజం ప్రారంభించనుంది. సోమశిల – శ్రీశైలం రూట్‌లో తొలి సర్వీసులు కల్పించనుంది. వీటితోపాటు సీప్లేన్ టూరిజం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. టూరిజం పోలీస్ ఫోర్స్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. టూరిజం పోలీస్ ఫోర్స్‌లో 15 మంది నుంచి 90 మందికి పెంచనుంది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ, ట్రావెల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, డిజిటల్ టూరిజం కార్డును కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత
For More TG News And Telugu News