CM Revanth Reddy Meets Abhishek Manu Singhvi: అభిషేక్ సింఘ్వీతో రేవంత్ బృందం భేటీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:48 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది.
ఢిల్లీ, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) , ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఇవాళ(సోమవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది. ఢిల్లీలో పలువురిని కలిసి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో (Abhishek Manu Singhvi) సమావేశం అయ్యారు. సింఘ్వీతో భేటీకి సంబంధించిన విషయాలను మీడియాకు భట్టి విక్రమార్క వెల్లడించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అభిషేక్ సింగ్వీతో సమావేశం అయ్యామని తెలిపారు. దేశంలోని అత్యున్నతమైన న్యాయ కోవిదుల ఆలోచనలు తీసుకొని బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అన్ని వివరాలు అభిషేక్ మనుసింఘ్వీకి వివరించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అభిషేక్ మనుసింఘ్వీ తమకు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో తమ నివేదికను కేబినెట్ ముందు పెడతామని వెల్లడించారు. అలాగే కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో దారుణం.. యజమానిపై అమానుష దాడి
వారిద్దరూ రాహుల్‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.