CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ
ABN , Publish Date - Dec 22 , 2025 | 09:53 PM
పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అసత్య ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలమూరుకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో మంత్రులతో ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మూడు గంటలపాటు ఈ సమావేశం సాగింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడంపై మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి.
పార్టీ కేడర్‌ను ఇదే ఉత్సాహంతో ముందుకు తీసుకు పోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఉత్సహం చూపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులపై సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
రాష్ట్రంలోని అన్ని జెడ్పీ పీఠాలను క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిందామని పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అసత్య ప్రచారాలను మనం బలంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలమూరుకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిందామని తెలిపారు. ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరికి కేసీఆర్ చేసిన అన్యాయాన్ని పూర్తిస్థాయిలో మనం వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News