Share News

CM Revanth Reddy: వారిపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం‌ రేవంత్‌రెడ్డి వార్నింగ్

ABN , Publish Date - May 16 , 2025 | 10:24 PM

CM Revanth Reddy: వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం‌ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వానాకాలం సాగుకు సిద్ధమవ్వాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం‌ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

CM Revanth Reddy: వారిపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం‌ రేవంత్‌రెడ్డి  వార్నింగ్
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఇవాళ(శుక్రవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వానకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


సరిహద్దుల్లో విత్తన రవాణాపై నిఘా పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులను మోసగాళ్ల నుంచి రక్షించాలని ఆదేశించారు. విత్తనాలపై కలెక్టర్‌లు, ఎస్పీలతో సమన్వయం చేయాలని సూచించారు. వానలు ముందుగానే కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లూజ్ విత్తనాలు కొనొద్దని.. ప్యాక్‌తోనే కొనాలని సూచించారు. విత్తన ప్యాకెట్, బిల్‌ను భద్రపరచాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నకిలీ విత్తనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ఈ సీజన్‌లో వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందని చెప్పారు. అవసరమైనన్ని విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


కాగా.. నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌కు బయలుదేరే యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లి హజ్‌హౌస్ వద్ద హజ్‌కు బయలుదేరే యాత్రికుల బస్సును జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Konda Surekha Comments: కామన్‌గా చెప్పా.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు

MP Chamala: యూట్యూబ్ చానల్స్‌తో కేటిఆర్ తప్పుడు ప్రచారం...

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 06:51 AM