Share News

Godavari Tribunal: గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:28 PM

గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే తెరపైకి గోదావరి ట్రిబ్యునల్ వచ్చింది.

Godavari Tribunal: గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం
Godavari River Water Disputes

హైదరాబాద్: గోదావరి నదీ జలాల వివాదాలపై (Godavari River Water Disputes) కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే తెరపైకి గోదావరి ట్రిబ్యునల్ వచ్చింది. ఇటీవల కేంద్ర జలమంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంబంధిత అధికారులతో చర్చించారు. మహారాష్ట్ర ,తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో గోదావరీ నదీ పరివాహక ప్రాంతం ఉంది. గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధిత రాష్ట్రాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల మధ్య జలాల వినియోగంపై వివాదాలు వస్తున్నాయి.


తాజాగా గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌లకు ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ విషయంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్‌లకు చత్తీస్‌ఘడ్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల మధ్య వివాదాలు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం, ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వస్తోండటంతో ఏం చేయాలనే దానిపై కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ దిశలో గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని కేంద్ర జల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.


గతంలో ఆయా రాష్ట్రాల మధ్య జలాల వివాదాన్ని పరిష్కరించి అవార్డ్ ఇచ్చిన బచావత్ నేతృత్వంలోనే గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 1980లో అవార్డ్ ప్రకటించిన అనంతరం గోదావరి నదీ జలాల విదాద ట్రిబ్యునల్ మనుగడలో లేకుండా పోయింది. కృష్ణా నదీ జలాల వినియోగానికి కూడా గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకటించింది. కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి వివాదాలు తలెత్తుతుండటంతో బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్లీ గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యా సాద్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు

అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 04:01 PM