Ambati Rambabu: అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:59 AM
సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వరుసగా కేసులు నమోదువుతోన్నాయి.
నరసరావుపేట, జూన్ 22: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోని నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆంక్షలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అతిక్రమించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్‌లో ఇప్పటికే కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
అయితే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు ఉన్నారు. దీంతో రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా అధ్యక్షుడి హోదాలో అంబటి రాంబాబు భారీగా జన సమీకరణ చేపట్టారు. అందులో భాగంగా వందల సంఖ్యలో ప్రజలనే కాకుండా.. వారి కోసం భారీగా వాహనాలను సైతం ఆయన ఏర్పాటు చేశారు. కానీ సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన కారణంగా ఉద్రిక్తతలు నెలకునే అవకాశం ఉందంటూ ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి నివేదిక అందింది.
ప్రపంచ యోగా దినోత్సవానికి ముందు గలాటా సృష్టించేందుకు వైసీపీ పన్నాగం పన్నినట్లు ఆ నివేదికలో క్లియర్ కట్‌గా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ జగన్ పర్యటనలో భారీగా జనం హాజరుకావడంతోపాటు పలు సంఖ్యలో వాహన శ్రేణి సైతం ఏర్పాటు చేశారు. అదీకాక.. ఈ ఆంక్షల్లో భాగంగా పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అయితే వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వాటిని పక్కకు తీసేందుకు అంబటి రాంబాబుతోపాటు ఆయన సోదరుడు ప్రయత్నించారు. పోలీసులు వారించే ప్రయత్నం చేసినా.. వారిని అంబటి రాంబాబు పక్కకు తోసేశారు. ఈ నేపథ్యంలో స్థానిక డీఎస్పీ రంగంలోకి దిగి.. అంబటి సోదరులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఝలక్
తరగతి గదిలో విద్యార్థులు.. వారి ఎదుటే ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే..
For AndhraPradesh News And Telugu News