Share News

Teacher: తరగతి గదిలో విద్యార్థులు.. వారి ఎదుటే ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jun 22 , 2025 | 08:30 AM

తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఇవేమీ పట్టించుకోలేదు. వారంతా చిన్న పిల్లలు కావడంతో ఆ ఉపాధ్యాయుదు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాడు.

Teacher: తరగతి గదిలో విద్యార్థులు.. వారి ఎదుటే ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే..
Teacher sleep in Class Room

ముంబై, జూన్ 22: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. ఆ విషయాన్ని మరిచిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ క్రమంలో పెద్దగా గురక పెట్టడమే కాకుండా.. కాళ్లను బల్లపై పెట్టి నిద్రపోయాడు. తరగతి గదిలో విద్యార్థులు ఉండగానే సదరు ఉపాధ్యాయుడు ఈ పని చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర జల్నా జిల్లాలోని గదేగావన్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలోని ఉర్ధు మీడియం స్కూల్‌లో చోటు చేసుకుంది. 15 నుంచి 20 మంది విద్యార్థులు.. తరగతి గదిలో ఉండగా ఉపాధ్యాయుడు నిద్ర పోవడం గమనార్హం.

Teacher-sleeping.jpg


ఉపాధ్యాయుడు ఎంత సేపటి నుంచి నిద్ర పోతున్నాడంటూ ఈ వీడియో తీసిన వ్యక్తి.. తరగతి గదిలోని విద్యార్థిని ప్రశ్నించారు. ఆమె భయపడుతూ.. దాదాపు అర గంట నుంచి ఆయన నిద్ర పోతున్నారని చెప్పింది. ఇక తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిద్ర పోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఉన్నతాకారులు రంగంలోకి దిగారు. అందులోభాగంగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.


నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటుంటే.. తమ పిల్లలను చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా పంపిస్తామంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తరగతి గదిలో సగానికిపైగా విద్యార్థులు ఉన్నారని.. అలాంటి వేళ వారి ఎదుట ఉపాధ్యాయుడు ఎలా నిద్రపోయాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

బిహార్‌లో పెన్షన్‌ మొత్తం రూ.1,100కు పెంపు

For National News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 08:30 AM