Share News

Bihar: బిహార్‌లో పెన్షన్‌ మొత్తం రూ.1,100కు పెంపు

ABN , Publish Date - Jun 22 , 2025 | 06:18 AM

బిహార్‌లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతున్నట్టు శనివారం ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ ప్రకటించారు.

Bihar: బిహార్‌లో పెన్షన్‌ మొత్తం రూ.1,100కు పెంపు

  • ఒకేసారి రూ.700 హెచ్చింపు

పట్నా, జూన్‌ 21: బిహార్‌లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతున్నట్టు శనివారం ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ ప్రకటించారు. ఇంతవరకు నెలకు రూ.400 ఇస్తుండగా, దాన్ని రూ.1,100కు పెంచారు. ఒకేసారి రూ.700 మేర పెంచినట్టు తెలిపారు. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెల పదో తేదీన ఈ సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని వెల్లడించారు.


దీని ద్వారా 1.09 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని సీఎం తెలిపారు. పెన్షన్ల కోసం ఇంతవరకు ఏటా 5,405.58 కోట్లు వెచ్చిస్తుండగా, ఇకపై సుమారు 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అఽధికారవర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Updated Date - Jun 22 , 2025 | 06:18 AM