Shamshabad Airport: రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:56 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్రిటిష్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానం రన్ వేపై నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా ఈ విమానం టేకాఫ్ తీసుకోక పోవడంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్, జూన్ 22: ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం కారణంగా అనుమతి రాకపోవడంతో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లవలసిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచి పోయింది. విమానం టేకాఫ్ కాకపోవడంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై 10 రోజులు అయింది. ఈ ఇరుదేశాలు.. అణు కేంద్రాలను, ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని క్షీపణులు, డ్రోనులతో ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా సైతం రంగంలోకి దిగింది. దీంతో టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. అలాంటి వేళ.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆకాశంలో ప్రయాణించే విమాన సర్వీసులకు ప్రమాదం జరిగే అవకాశముందని సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చేందుకు ఎయిర్ పోర్ట్ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. వివిధ దేశాలు కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో భారత్ సైతం ఉన్న విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈటలకు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
For Telangana News And Telugu News