Share News

Supreme Court on BC Reservation: బీసీ రిజర్వేషన్లు.. సుప్రీం సంచలన తీర్పు

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:00 PM

బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించింది.

Supreme Court on BC Reservation: బీసీ రిజర్వేషన్లు.. సుప్రీం సంచలన తీర్పు
Supreme Court on BC Reservation

హైదరాబాద్: బీసీల రిజర్వేషన్లపై (BC Reservations) సుప్రీంకోర్టు (Supreme Court)లో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ని విచారించడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ ఎందుకు ఫైల్‌ చేశారని పిటిషనర్‌ న్యాయవాదిని జస్టిస్‌ విక్రంనాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.


రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్ధదవే, అభిషేక్‌ సింఘ్వీ, ఎడీఎన్‌ రావు హాజరయ్యారు. ఈ పిటిషన్‌ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున... విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది ధర్మాసనం. హైకోర్టు స్టే ఇవ్వలేదని... అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. స్టే ఇవ్వకపోతే... సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ప్రశ్నించి... పిటిషన్‌ని డిస్మిస్ చేసింది జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.


అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో నెంబర్- 9ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి (Vanga Gopal Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం.. పలు కాలనీలు జలమయం

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 01:24 PM