CM Chandrababu: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:53 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. గ్లోబల్ సమ్మిట్ 2025కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణ, పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ఇవాళ(సోమవారం) నుంచి రెండు రోజులపాటు అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (CM Revanth Reddy) నిర్వహిస్తోంది. అయితే, గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (AP CM Nara Chandrababu Naidu) అమరావతి నివాసంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని సీఎం చంద్రబాబు చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ దృష్ట్యా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు సీఎం చంద్రబాబు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
కాగా, హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఇందుకోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్లోబల్ సమ్మిట్‌ను ఇవాళ మధ్యాహ్నం 1:30లకు ప్రారంభించనున్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌పై ప్రసంగించనున్నారు.
ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది అతిథులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు ఆరు వేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేటు నుంచి సమ్మిట్ వేదిక వరకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేస్తున్నారు. అతిథుల భద్రత దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు ఎంతో విలువైన పెట్టుబడులు వస్తాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
For More TG News And Telugu News