Rains: భారీ వర్షాలతో హైవే రోడ్డు మూసివేత.. హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్లేవారికి పోలీసుల అలర్ట్..!
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:41 AM
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నిర్మల్ జిల్లా పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వరద కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
నిర్మల్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనదారుల కోసం నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వరద నీటి కారణంగా రహదారుల ఘోరంగా దెబ్బతినడంతో వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి వరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాహనదారులు గమ్యం చేరుకునేందుకు ఏ వైపుగా ప్రయాణించాలో రూట్ మ్యాప్ విడుదల చేశారు.
ఆదిలాబాద్ నుంచి వాహనదారులు కొండాపూర్ బ్రిడ్జి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఎడమవైపుకు మళ్లి డైవర్షన్ మార్గాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో వాహనదారులు మామడ, ఖానాపూర్‌మెట్, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ రూట్ ఛేంజ్ గురించి ఎస్పీ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. కాబట్టి, ప్రయాణికులు ముందస్తుగా మార్గ సమాచారం తెలుసుకుని ప్రయాణించాలని భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే హైదరాబాద్ నుంచి NH 44 (నాగ్‌పూర్ హైవే) మీదుగాఆదిలాబాద్ వెళ్లే వాహనదారుల భద్రత కోసం సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే హెవీ వెహికల్స్ మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ చేరుకోవాలి. లైట్ వెయిట్ వెహికల్స్ నడిపేవారైతే మేడ్చల్ అనంతరం వచ్చే తూర్పాన్ వద్ద డైవర్షన్ తీసుకుని హెవీ వెహికల్స్ కోసం సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే ఆదిలాబాద్ వెళ్లాలి.
Also Read:
డ్రగ్స్ కేసులో.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన
తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు..
For More Telangana News