AP Disaster Management Authority: అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:54 PM
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది.
అమరావతి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పిలుపునిచ్చారు.
కృష్ణా నదిలో వరద పరిస్థితి:
శ్రీశైలం జలాశయం
ఇన్ ఫ్లో: 3.06 లక్షల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 3.62 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్
ఇన్ ఫ్లో: 2.69 లక్షల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 3.17 లక్షల క్యూసెక్కులు
పులిచింతల
ఇన్ ఫ్లో: 3.13 లక్షల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 3.72 లక్షల క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్
ఇన్ ఫ్లో / ఔట్ ఫ్లో: 4.05 లక్షల క్యూసెక్కులు
గోదావరి నదిలో స్వల్పంగా పెరుగుతున్న నీటిమట్టం:
భద్రాచలం ప్రస్తుత నీటిమట్టం : 37.70 అడుగులు
కూనవరం నీటిమట్టం : 15.78 మీటర్లు
పోలవరం నీటిమట్టం: 10.16 మీటర్లు
ధవళేశ్వరం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 5.31 లక్షల క్యూసెక్కులు
రేపటికి మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
హెచ్చరిక:
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వాగులు, కాలువలు, వరద నీటిలో దాటే ప్రయత్నాలు చేయరాదు.
అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
ఎప్పటికప్పుడు పబ్లిక్ అనౌన్స్‌మెంట్లు, అధికారిక సమాచారం తెలుసుకోవాలి.
అత్యవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలిపోవాలి
వర్షాలు కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సహకరిస్తేనే ప్రమాదాలు తప్పుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అలాగే, వినాయక నిమజ్జనాల సమయంలో నదుల్లోకి దిగే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read:
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద
ప్రకాశం బ్యారేజ్‌కు మొదటి ప్రమాద హెచ్చరిక
For More Latest News