Hussain Sagar: హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:12 PM
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినట్లు అధికారులు చెబుతున్నారు. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినట్లు అధికారులు చెబుతున్నారు. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది. హుస్సేన్ సాగర్‌కు ఇన్ ఫ్లో 1520 క్యూసెక్కులు ఉండగా.. 1190 క్యూసెక్కుల నీరు మూసిలోకి విడుదల చేస్తున్నారు. హుస్సెన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.75 మీటర్లు కాగా.. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. హుస్సేన్ సాగర్ నుంచి తూముల ద్వారా నీటిని మూసి లోకి వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!