Share News

Kokichi Akuzawa: జపాన్ తాత రేర్ ఫీట్..102 ఏళ్ల వయసులో ఫుజీ పర్వతం ఎక్కి గిన్నిస్ రికార్డు!

ABN , Publish Date - Aug 28 , 2025 | 01:57 PM

వయసు జస్ట్ నెంబర్ మాత్రమే నిరూపించాడు జపాన్‌కు చెందిన కోకిచి అకుజావా తాత. 102 ఏళ్ల వయసులోనూ ఊహకు అందని రీతిలో అరుదైన ఫీట్ సాధించాడు. జపాన్‌లో అత్యంత ఎత్తైన ఫుజీ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

Kokichi Akuzawa: జపాన్ తాత రేర్ ఫీట్..102 ఏళ్ల వయసులో ఫుజీ పర్వతం ఎక్కి గిన్నిస్ రికార్డు!
Kokichi Akuzawa Climbs Mount Fuji at 102

జపాన్: 60 ఏళ్లు దాటితే ఇక నాపనైపోయింది. నేనేం చేయలేను. పెద్ద వయసులో సొంత పనులే చేసుకోవడం కష్టమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, వయసు జస్ట్ ఒక నంబర్ మాత్రమే అని మరోసారి ప్రపంచానికి రుజువు చేశాడు జపాన్‌కు చెందిన కోకిచి అకుజావా తాత. 102 ఏళ్ల వయసు తన కలలకు అడ్డంకి కాదని నిరూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాడు. వయసులో సెంచరీ దాటేయడమే రేర్ ఫీట్ అనుకుంటే.. ఇప్పటికే సెంచరీ దాటేసిన కోకిచి తాత తరగని ఉత్సాహంతో 3,776 మీటర్ల ఎత్తున్న ఫుజీ శిఖరాన్ని చకాచకా ఎక్కేసి వావ్ అనిపించాడు. అంతేకాదు.. ఈ పర్వతాన్ని అధిరోహించిన అతి పెద్ద వయస్కునిగా రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.


102 ఏళ్ల వయసులో జపాన్ తాత రేర్ ఫీట్..

1923లో జన్మించిన కోకిచి అకుజావా ఒక రైతు, హైకర్, స్వచ్ఛంద సేవకుడు, పెయింటర్ కూడా. చిన్నతనం నుంచి పర్వతారోహణ అంటే అమితమైన మక్కువ. ఈ జనవరిలో ఇంటి దగ్గర హైకింగ్ చేస్తున్నప్పుడు జారిపడ్డాడు. ఆ తర్వాత తీవ్రమైన గుండె జబ్బు వైఫల్యంతో ఆస్పత్రిలో నెలల తరబడి గడిపాడు. శారీరకంగా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఫుజీ పర్వతాన్ని అధిరోహించేందుకు పూనుకున్నాడు. 102 ఏళ్ల వయసులోనూ దాదాపు ప్రతివారం పర్వతారోహణలో నెలల తరబడి శిక్షణ తీసుకున్నాడు. 75 ఏళ్ల కుమార్తె యుకికో, ఇతర కుటుంబ సభ్యుల సాయంతో ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే నడక మొదలుపెట్టేవాడు. అలా కొద్ది రోజుల్లోనే ఫుజీ శిఖరాగ్రానికి చేరుకున్నాడు.


japan-old.jpg

గిన్నిస్ రికార్డు పట్టేసి..

కోకిచి అకుజావా తాత సాధించిన ఘనతను ఈ ఆగస్టు ప్రారంభంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.102 ఏళ్ల 51 రోజుల వయసులో ఫుజీ పర్వతాన్ని అధిరోహించిన పెద్ద వయస్కుడిగా ఘనత కట్టబెట్టింది. అయితే, అకుజావా 96 సంవత్సరాల వయస్సులోనూ 3,776 మీటర్ల (12,388 అడుగులు) ఎత్తున్న ఫుజీ శిఖరాన్ని అధిరోహించడం విశేషం.


అడుగుతీసి అడుగు వేయడానికే ప్రయాసపడే వయసులో జపాన్‌లోనే అత్యంత ఎత్తైన ఫుజీ శిఖరాన్ని అలవోకగా ఎక్కేసి ఔరా అనిపించుకుంటున్నాడు కోకిచి అకుజావా. కోరుకున్న కలను, లక్ష్యాలను అందుకునేందుకు వయసు ఎప్పుడూ అడ్డంకి కాదని నిరూపించేందుకు కోకిచి తాత చేసిన ప్రయత్నాన్ని గ్రేట్ అని పొగడాల్సిందే కదా..


ఇవి కూడా చదవండి..

రైల్వే స్టేషన్‌‌లో జైలు సీన్.. ఏం చేశారో మీరే చూడండి..

గదిని ఫ్రిడ్జ్‌గా మార్చేశాడుగా.. డోరుకు ఎలాంటి సెట్టింగ్ చేశాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 02:27 PM