Distress call- woman's death: గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్..ఆమె చెప్పింది విన్న వివాహిత షాక్‌తో దుర్మరణం
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:30 AM
యూపీలో తాజాగా షాకంగ్ ఘటన వెలుగు చూసింది. నీ భర్తకు రెండో భార్యనంటూ గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ రావడంతో షాక్ తిన్న యువతి చివరకు కన్నుమూసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నీ భర్తకు రెండో భార్యనంటూ గుర్తు తెలియని మహిళ ఫోన్ చేయడంతో షాక్ ఓ వివాహిత తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నుమూసింది. మృతురాలిని యూపీలోని హర్దోయి జిల్లాకు చెందిన రీటాగా గుర్తించారు. భర్తతో గొడవల కారణంగా రీటా ప్రస్తుతం తన తల్లి, సోదరుడితో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది.
మంగళవారం రీటాకు భర్త మొబైల్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. గుర్తు తెలియని మహిళ రిటాతో మాట్లాడింది. తాను ఆమె భర్తకు రెండో భార్యనని చెప్పుకొచ్చింది. దీంతో, రీటా తీవ్ర ఒత్తిడికి లోనైంది. వెంటనే తన తల్లి, సోదరుడికి తీసుకుని స్వగ్రామానికి బయలుదేరింది. అయితే, ప్రయాణంలో ఉండగా రీటా తీవ్ర అసౌకర్యానికి లోనైంది. మనోవేదన కారణంగా తల్లి ఒళ్లో తలపెట్టుకుని రోదించింది. ఆ మరుక్షణమే కుప్పకూలిన ఆమె బస్సులోనే కన్నుమూసింది. ఆటోరోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధికున్నీ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
రీటా భర్త పేరు శైలేంద్ర. అతడిది సీతాపూర్ జిల్లా. రెండున్నర ఏళ్ల క్రితం వారి వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది కాలానికే రీటాకు టీబీ ఉన్నట్టు తేలడంతో చికిత్స కోసం పుట్టింటికి తిరిగొచ్చేసింది. పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అత్తవారింటికి వెళ్లింది. ఆ తరువాత ఆమె తండ్రి చనిపోవడంతో మళ్లీ పుట్టింటికి వచ్చింది. ఈ సమయంలోనే రీటాకు ఆమె భర్తకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన తల్లి, సోదరుడితో కలిసి ఢిల్లీకి వెళ్లింది.
ఇక రీటా మృతిపై ఆమె సోదరుడు ఆటరోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ మార్కండేయ పాండే మాట్లాడుతూ రీటా మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం, దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
భార్యను హీరోయిన్‌లా మార్చేందుకు బలవంతంగా కసరత్తులు.. మహిళకు అబార్షన్
టీచర్ కొట్టారన్న కోపంతో తుపాకీతో కాల్పులు..
For More Crime News and Telugu News