Uttarakhand School Shooting: టీచర్ కొట్టారన్న కోపంతో తుపాకీతో కాల్పులు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:13 AM
ఉత్తరాఖండ్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన చెంప చెళ్లుమనిపించిన టీచర్‌పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. టీచర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాశీపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి తన టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అధ్యాపకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం, అంతకుముందు ఆ టీచర్ సదరు విద్యార్థి చెంప ఛెళ్లుమనిపించాడు. అది మొదలు టీచర్‌పై కోపం పెంచుకున్నా విద్యార్థి ఇటీవల తన లంచ్ బాక్సులో తుపాకీ దాచి స్కూలుకు తీసుకొచ్చాడు. ఆ తరువాత అవకాశం దొరకగానే క్లాసులో అందరి ముందు టీచర్‌పై కాల్పులు జరిపాడు. భుజంలోకి తూటా దూసుకుపోవడంతో టీచర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
ఈ ఘటన కాశీపూర్ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. టీచర్‌లు నిరసన కార్యక్రమాలను తెరతీశారు. పలు స్కూళ్లూ మూతపడ్డాయి. మరోవైపు, తెగబడ్డ స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఇక యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో సోమవారం దాదాపు ఇలాంటి ఘటన వెలుగు చూసింది. స్టూడెంట్‌ల మధ్య వివాదం ఓ విద్యార్థి హత్యకు దారి తీసింది. జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి ఆదిత్య వర్మను 9వ తరగతి విద్యార్థి కత్తితో పొడవడంత బాధిత స్టూడెంట్ కన్నుమూశాడు. నీళ్ల బాటిల్‌లో కత్తిని దాచి తీసుకుకొచ్చి విద్యార్థి బాత్రూమ్ వద్ద ఆదిత్య వర్మపై దాడి చేశాడు. మరో విద్యార్థితో తలెత్తిన వివాదంపై ఆదిత్య మాట్లాడుతున్న సందర్భంలో ఈ దారుణం జరిగినట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి
అలర్ట్.. లీటర్ పాలకు ఆర్డర్ పెట్టేందుకు ట్రై చేస్తే.. ఏకంగా రూ.18.5 లక్షల లాస్
వధువు లవర్ దారుణం.. బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను వరుడికి గిఫ్ట్‌గా ఇస్తే..
For More National News and Telugu News