When to Replace Old Pillow: దిండ్లకూ ఎక్స్‌పైరీ డేట్.. ? గడువులోగా మార్చకపోతే ఈ సమస్యలు..!
ABN , Publish Date - Aug 28 , 2025 | 12:46 PM
దిండు లేకుండా నిద్రపోయే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు దిండ్లు ఉపయోగిస్తారు. శుభ్రంగా ఉండాలని ఎప్పటికప్పుడు దిండు కవర్లను మారుస్తారు కానీ.. దిండ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?
ఆరోగ్యంగా ఉండలాంటే మంచంతో పాటు దిండ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే రాత్రి కనీసం 8 గంటల పాటు నిర్విరామంగా పక్కపైనే నిద్రిస్తారు అంతా. ఆ సమయంలో శరీరం నుంచి లాలాజలం, చెమట, మృతకణాలు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వంటివి బెడ్ షీట్లు, దిండు కవర్లపైనా పరచుకుంటాయి. నిరంతరం ఉపయోగించడం వల్ల అవి అపరిశుభ్రంగా మారుతాయి. అందుకే అందరూ దిండు కవర్లు, దుప్పట్లు తరచూ శుభ్రం చేస్తారు. కొన్నాళ్లు గడిచాక మారుస్తారు కూడా. అయితే, పగలూ రాత్రి దిండ్లను ఏళ్ల తరబడి ఉపయోగిస్తూ పోతే కొన్నాళ్లకి మొత్తం క్రిములమయం అవుతాయి. ఇది తెలియక మనం వాటిని అలాగే వాడుతూ పోతే అలర్జీలు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదముంది. మరి, దిండ్లను ఎప్పుడు మార్చాలి? మార్చకపోతే ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
ధూమపానం, కాలుష్యం వల్లే ఊపిరితిత్తుల ఆరోగ్యం చెడిపోతుందనుకుంటే అది చాలా పొరపాటు. దిండ్లను మార్చకుండా ఏళ్ల తరబడి ఉపయోగించడం అనే చిన్న అలవాటు ప్రాణాంతక శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందంటే నమ్మగలరా.. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజమంటున్నారు వైద్యులు. దిండు ఎప్పుడు మార్చాలని మనకెలా తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం.
దిండును ఎప్పుడు మార్చాలి?
దిండు మన శరీరానికి ఒక సహాయక వ్యవస్థగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మెడ, వెన్నెముకకు మద్దతు లభిస్తుంది. నిద్రపోయేటప్పుడు శరీరానికి సౌకర్యాన్ని అందిస్తుంది. కానీ వీటికి కూడా గడువు తేదీ ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత ముక్కు కారడం, తుమ్మడం, కళ్ళు దురదగా ఉండటం లేదా నీరు కారడం, నిరంతర దగ్గు వంటి లక్షణాలు దిండును మార్చాల్సిన అవసరాన్ని సూచిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చికాకులను తగ్గించడానికి ఒకటి నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి దిండ్లు మార్చాలని వైద్యులు సిఫార్సు చేస్తు్న్నారు. ఆస్తమా, సైనస్ సమస్యలు లేదా ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ప్రతి 3–6 నెలలకు కొత్త దిండ్లు వాడితే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే పాతవి అలెర్జీలను రేకెత్తిస్తాయి, ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తాయి. అరుదైన సందర్భాల్లో, హైపర్ సెన్సిటివిటీ న్యుమోనిటిస్ లేదా ఆస్పెర్‌గిలోసిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల పరిస్థితులకు దారితీస్తాయి.
దిండు మార్చాలని సూచించే లక్షణాలు
దిండు మన శరీరానికి ఒక సహాయక వ్యవస్థగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మెడ, వెన్నెముకకు మద్దతు లభిస్తుంది. నిద్రపోయేటప్పుడు శరీరానికి సౌకర్యాన్ని అందిస్తుంది. కానీ వీటికి కూడా గడువు తేదీ ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత ముక్కు కారడం, తుమ్మడం, కళ్ళు దురదగా ఉండటం లేదా నీరు కారడం, నిరంతర దగ్గు వంటి లక్షణాలు దిండును మార్చాల్సిన అవసరాన్ని సూచిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. దిండులోని దూది గట్టిపడినా, ఉదయ నిద్రలేవగానే వీపు, మెడలో బిగుతుగా, నొప్పిగా అనిపించినా దిండు మర్చాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాలి.
దిండును ఎప్పుడు మార్చాలి?
ఈ చికాకులను తగ్గించడానికి ఒకటి నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి దిండ్లు మార్చాలని వైద్యులు సిఫార్సు చేస్తు్న్నారు. ఆస్తమా, సైనస్ సమస్యలు లేదా ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ప్రతి 3–6 నెలలకు కొత్త దిండ్లు వాడితే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే పాతవి అలెర్జీలను రేకెత్తిస్తాయి, ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తాయి. అరుదైన సందర్భాల్లో, హైపర్ సెన్సిటివిటీ న్యుమోనిటిస్ లేదా ఆస్పెర్‌గిలోసిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల పరిస్థితులకు దారితీస్తాయి. దిండును రోజూ నిరంతరం ఉపయోగిస్తుంటే కనీసం ప్రతి 18 నెలల నుండి 2 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మార్చడం ముఖ్యం. అనుమానం ఉంటే ఓసారి దిండును మడవండి.అది వెంటనే దాని పాత ఆకారంలోకి వస్తుందో లేదో చూడండి. వస్తే వాడేందుకు అనుకూలంగా ఉందని అర్థం. అదే మడతపెట్టి ఉంటే దిండును మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.
పాత దిండ్ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు
దిండు ఇన్ఫెక్షన్ వల్ల తరచుగా వచ్చే ఫ్లూ, జ్వరం, దగ్గు వస్తాయి.
ముఖ అలెర్జీలు వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
ఒకే దిండును నిరంతరం ఉపయోగించడం వల్ల వీపు, మెడ నొప్పులు వస్తాయి.
క్రిములు ఊపిరితిత్తుల్లోకి చేరుకుని శ్వాసకోశ సమస్యలు రావచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
పాన్ కార్డ్ పోగొట్టుకున్నారా? వెంటనే ఇలా చేయండి.!
కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తగ్గుతాయా?
For More Latest News