Flood Alert Issued in Andhra Pradesh: భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త..!
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:27 AM
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నాడు హోంమంత్రి అనిత ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి..
అమరావతి, ఆగస్టు 28: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నాడు హోంమంత్రి అనిత ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడారు. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు హోంమంత్రి అనిత.
లంక గ్రామాలకు అలర్ట్..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన చేశారు. కృష్ణా నది వరద ప్రవాహం భారీగా పెరుగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతంగా వస్తోందని చెప్పారు. మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారాయన. ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్ల 3.62 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లంక గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు ప్రఖర్ జైన్.
Also Read:
మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో.. యూనివర్సిటీ కీలక
పిల్లల ఆరోగ్యంలో ఈ తేడాలుంటే డయాబెటిస్!..
For More Andhra Pradesh News and Telugu News..