Share News

Boiled Vegetables: కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తగ్గుతాయా?

ABN , Publish Date - Aug 27 , 2025 | 07:32 PM

కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తగ్గుతాయని చాలా మంది అంటుంటారు. అయితే, కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు నిజంగా తగ్గుతాయా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Boiled Vegetables: కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తగ్గుతాయా?
Boiled Vegetables

ఇంటర్నెట్ డెస్క్‌: చాలా మంది ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిరోజు కొన్ని పచ్చి కూరగాయలు తింటారు. మరి కొందరూ ఉడికించిన కూరగాయలు తింటారు. అయితే, కూరగాయలను ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయని ఇంట్లో పెద్దలు అంటుంటారు. అతిగా ఉడికిస్తే పోషకాలు నశించిపోతాయి అని చెబుతారు. అయితే, ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..


కూరగాయలలో లభించే పోషకాలు

కూరగాయలలో విటమిన్లు (ఎ, సి, కె, బి-కాంప్లెక్స్), ఖనిజాలు (కాల్షియం, ఐరన్, పొటాషియం), ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, అవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ, పోషకాల ప్రభావం మీరు వాటిని ఎలా వండుతారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.


ఎక్కువగా ఉడికిస్తే ఏమి జరుగుతుంది?

కూరగాయలను ఎక్కువసేపు ఉడకబెట్టినప్పుడు లేదా వేయించినప్పుడు, వాటిలో ఉండే కొన్ని సున్నితమైన విటమిన్లు (విటమిన్ సి, బి-కాంప్లెక్స్ వంటివి) విచ్ఛిన్నం కావడం ప్రారంభిస్తాయి. ఇవి నీరు, వేడికి చాలా సున్నితంగా ఉంటాయి.

ఉదాహరణకు: విటమిన్ సి - నిమ్మకాయ, టమోటా, క్యాప్సికమ్ ఆకుకూరలలో లభిస్తుంది. ఎక్కువసేపు ఉడికించినట్లయితే దానిలో ఎక్కువ భాగం నాశనమవుతుంది.

బి విటమిన్లు - బి-కాంప్లెక్స్ నీటిలో కరుగుతాయి. అందువల్ల, వాటిని ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు, అవి నీటిలో కరిగిపోతాయి. కూరగాయలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే, అన్ని పోషకాలు కోల్పోవు. కొన్ని ఖనిజాలు (ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటివి) వేడి వల్ల ప్రభావితం కావు. వంట చేయడం వల్ల కొన్ని పోషకాలు కూడా పెరుగుతాయి.

  • టమోటా - దీనిలో ఉండే లైకోపీన్ (యాంటీఆక్సిడెంట్) ఉడికించిన తర్వాత మరింత చురుగ్గా మారుతుంది.

  • క్యారెట్ - దీనిలో ఉండే బీటా-కెరోటిన్ తేలికగా ఉడికించినప్పుడు శరీరం బాగా గ్రహిస్తుంది.


జాగ్రత్తలు:

  • కూరగాయలను ఎక్కువసేపు ఉడికించవద్దు.

  • ఆవిరి మీద ఉడికించి తేలికగా వేయించడం మంచిది.

  • తక్కువ నీటిని వాడండి.

కూరగాయలను వాటి తొక్కలతో పాటు తినడానికి ప్రయత్నించండి, ఎందుకంటే తొక్కలలో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి.


వైద్యులు ఏమి చెబుతున్నారు

ఆహార నిపుణుల ప్రకారం, కూరగాయలను వండే విధానం వాటిల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో నిర్ణయిస్తుందని వివరించారు. విటమిన్ సి, బి-కాంప్లెక్స్ వంటివి నీరు, వేడికి త్వరగా విచ్ఛిన్నమవుతాయి. కూరగాయలను ఎక్కువసేపు ఉడకబెట్టినట్లయితే, ఈ పోషకాలు నీటిలో కరిగి శరీరానికి చేరవు. ఎక్కువగా ఉడికించడం వల్ల కొన్ని విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయి. కానీ ఉడికించిన కూరగాయలు పనికిరానివని దీని అర్థం కాదు. సరిగ్గా ఉడికించిన కూరగాయలు కూడా పోషకమైనవి, శరీరానికి కూడా చాలా అవసరం. కాబట్టి సమతుల్యతను కాపాడుకోవడం మంచిది. ఎక్కువగా పచ్చిగా తినకుండా, ఎక్కువగా ఉడికించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ ఇవ్వాలో తెలుసా?

2030 కామన్వెల్త్ బిడ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్.. ఈ నగరానికి ఛాన్స్

For More Latest News

Updated Date - Aug 27 , 2025 | 07:32 PM