Bandi Sanjay On Helicopters: హెలికాప్టర్లు పంపించండి.. అధికారులకు బండి సంజయ్ ఫోన్
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:55 AM
నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో ఉన్నవారిని రక్షించడానికి రాష్ట్రానికి మూడు ఆర్మీ హెలికాప్టర్లు రావాల్సి ఉంది. హెలికాప్టర్లు ఎంతకు రాకపోయే సరికి రక్షణ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు కేంద్ర రక్షణ శాఖ అధికారులు చెప్పారని తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో బాధిత ప్రాంతాలకు చాపర్లు రావడంలో ఆలస్యమవుతోందని వివరించారు. ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి చాపర్లను రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. వీలైనంత తొందరగా చాపర్లను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముప్పు ప్రాంతాల వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఏదైనా సమస్య ఎదురైతే.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బండి సంజయ్ సూచిస్తున్నారు.
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!