Telugu States Reservoirs: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం.. నిండుకుండల్లా ప్రాజెక్టులు
ABN , Publish Date - Aug 12 , 2025 | 09:04 AM
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరద నీరు పొటెత్తుతుండటంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది.
హైదరాబాద్, కర్నూలు, ఆగస్టు12 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణలలో(Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు (Reservoirs) జలకళను సంతరించుకున్నాయి. వరద నీరు పొటెత్తుతుండటంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టుల దగ్గర ప్రస్తుత నీటి పరిస్థితి ఇలా ఉంది.
హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద ఉధృతి..
హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 1800 క్యూసెక్కులు నీటికి చేరుకుంది. ఐదు గేట్ల ద్వారా మూడు అడుగుల మేర నీటిని కిందకు అధికారులు విడుదల చేశారు. మూసీకి వరద ప్రవాహం పెరగటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బండ్లగూడ జాగిర్, బాపూ ఘాట్, జియాగూడ, పురానాఫూల్, చాదర్‌ఘట్, గోల్నాక, ముసరాంబాగ్ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతోంది. అయితే, జియాగూడ, పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మోటార్ల సహాయంతో నీళ్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. రెండు రోజులపాటు జియాగూడ 100 ఫీట్ రోడ్ మూసివేస్తున్నట్లు తెలిపారు. పురానాపూల్ బ్రిడ్జిని కూడా మూసివేశామని అధికారులు వెల్లడించారు.
హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో: 1400 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 4800 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు...
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. రెండు గేట్లు పది అడుగులమేర డ్యామ్ అధికారులు ఎత్తనున్నారు. జలాశయం ముందుభాగంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లద్దంటూ సైరెన్ వేసి డ్యామ్ అధికారులు అప్రమత్తం చేశారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇన్ ఫ్లో :2,23,802 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 66,123 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 883 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుతం : 204.7889 టీఎంసీలు
మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుకుంది. వరద ప్రవాహంతో మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 13,254 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 645 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 643.60 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 4.46 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 4.09 టీఎంసీలు
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద..
మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 317.990 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం: 8.591 టీఎంసీలు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 318.516 మీటర్లు
ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం : 9.657 టీఎంసీలు
ఇన్ ఫ్లో: 1,35,000 Cusecs
ఔట్ ఫ్లో: 1,47,596 Cusecs
(5 PH units+ 17 Spillway gates)
శ్రీరాంసాగర్‌కు పెరిగిన వరద..
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు వరద కొనసాగుతోంది.
ఇన్ ఫ్లో : 18 వేల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 7 వేల క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 1091 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1079 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 80 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం: 44 టీఎంసీలు
ఈ వార్తలు కూడా చదవండి
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్‌లో ఘరానా మోసం.. దొంగ స్వామీజీ బురిడీ
Read Latest Telangana News And Telugu News