Share News

Deputy CM Bhatti Vikramarka: ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:20 AM

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన ఉప ముఖ్యమంత్రి....

Deputy CM Bhatti Vikramarka: ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

  • అధిష్ఠానం నాకిచ్చిన హామీని ప్రజలకు వివరించారు

  • ప్రజలకిచ్చిన హామీలను సర్కారు అమలు చేయాలి

  • ఎక్స్‌ వేదికగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌ వేదికగా తన వ్యాఖ్యలను పోస్ట్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు.. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్‌ సర్కారు అమలు చేయాలి. అవినీతి రహిత పాలన అందించాలి. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన వ్యాఖ్యలకు సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన భట్టి విక్రమార్క క్లిప్పింగ్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జతచేశారు.

Updated Date - Aug 12 , 2025 | 06:20 AM