Share News

Srushti Case: సృష్టి కేసులో మరో మలుపు.. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు సీజ్..

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:45 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వేకొద్దీ బయటికి వస్తున్నాయి. తాజాగా, డాక్టర్ నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు.

Srushti Case: సృష్టి కేసులో మరో మలుపు.. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు సీజ్..
Dr. Namrata Srushti case

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల సంఖ్య 24కు చేరింది. పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా అక్రమాల ‘సృష్టి’ కి కారకురాలైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత నుంచి తాజాగా కీలక విషయాలు రాబట్టారు. డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించిన సొమ్ముకు సంబంధించిన వివరాలను గుర్తించేపనిలో పడ్డారు.


ఇప్పటికే ఏ1 నమ్రతకు చెందిన 8 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. బ్యాంకు లాకర్లు, ఖాతాల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తులను దాచినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో 2018 నుంచి ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు.


సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందిరాలిగా ఉన్న డాక్టర్ నమ్రత పోలీసు కస్టడీలో కీలక వివరాలు వెల్లడించారు. సరోగసి పేరిట 80 మంది శిశువులను విక్రయించినట్లు ఆమె విచారణలో అంగీకరించారు. పేద, గిరిజన కుటుంబాలకు డబ్బాశ చూపి పిల్లలను కొనుగోలు చేశానని.. అనంతరం సంతానం లేని దంపతులకు సరోగసి ద్వారా పుట్టారని చెప్పి లక్షల రూపాయలకు అమ్ముకున్నానని దర్యాప్తులో వెల్లడించారు.


కాగా, మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పిల్లలను అపహరించే గ్యాంగులతో డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి నుంచి రూ.3-5 లక్షలకు శిశువులను కొనుగోలు చేసి.. సరోగసి పేరుతో దంపతులకు రూ.18 లక్షలు, రూ.25 లక్షలు, రూ.50 లక్షలు ఇలా భారీ మొత్తాలకు అమ్ముకున్నట్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, సృష్టి క్లినిక్ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా 200 మంది దంపతుల రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు సేకరించారు. వీరి వివరాలను రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రానికి అమిటీ యూనివ‌ర్సిటీ రాక.. ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్

అందరి లెక్కలు సెటిల్ చేస్తా : కేటీఆర్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 05:01 PM