Share News

Rahul Gandhi: EVMలపై అనుమానాలు ఉన్నాయి..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:28 PM

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు.

Rahul Gandhi: EVMలపై అనుమానాలు ఉన్నాయి..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi

ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణపై ఆయన మరోసారి తన గళం వినిపించారు. దేశంలో వస్తున్న ఎన్నికల ఫలితాలు అంచనాలను మించి ఉంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్‌లోనూ.. ఇదే విధంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు.


మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు. పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి

వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..

భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..

Updated Date - Aug 07 , 2025 | 02:28 PM