Revanth Reddy: రాష్ట్రానికి అమిటీ యూనివర్సిటీ రాక.. ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:52 PM
తెలంగాణలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ఛాన్సలర్ అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని చౌహాన్ పేర్కొన్నారు.
ఢిల్లీ: తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ అతుల్ చౌహాన్ కలిశారు.
తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని... స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని చౌహాన్ సీఎంకు తెలియజేశారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందన్నారు. తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యాసంస్థలపై పర్యవేక్షణ కరువైందని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం సీఎం రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని తీసుకరావడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్