KTR React: అందరి లెక్కలు సెటిల్ చేస్తా : కేటీఆర్
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:31 PM
ఓ మాజీ బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం మళ్లీ రాష్ట్రంలో దుమారం రేపుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎవడెవడో ఎదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్‌లో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం ఒక్కటి. ఈ ప్రచారం చాల రోజుల నుంచి నడుస్తున్న ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో చతికలపడింది. కాగా, మరోసారి ఈ విలీన ప్రచారం వీరంగం చేస్తోంది. తాజా పరిణామాలతో మళ్లీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం జోరందుకుంది. అయితే.. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఎన్నిసార్లు కొట్టిపడేసిన మళ్లీ మళ్లీ తెరపైకి రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది..
తాజాగా.. ఓ మాజీ బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం మళ్లీ రాష్ట్రంలో దుమారం రేపుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎవడెవడో ఎదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
అందరి లెక్కలు సెటిల్ చేస్తా..
కాంగ్రెస్, బీజేపీకి మూడు చెరువుల నీళ్లు తాగించి బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అతి చేస్తోన్న పోలీసుల పని చెప్తామని హెచ్చరించారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో రాసి పెట్టుకుంటున్నామని తెలిపారు. అందరి లెక్కలు సెటిల్ చేసే బాధ్యత తనదే అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో కేసీఆర్ చూపించారని.. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఎమ్మెల్యేల పరిస్థితి ఆదోగతి..
రేవంత్ రెడ్డిని మరోసారి కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి ఓడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి విచిత్రంగా తయారైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సేలు అతి తెలివిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ పార్టీలో ఉన్నామో కూడా పార్టీ మారిన వాళ్ళకు అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్