YS Sunitha: గొడ్డలిపోటును.. గుండెపోటుగా నమ్మించారు.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:20 PM
నాన్న గొడ్డలిపోటుతో పడిఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారని ఆరోపించారు. హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవి హత్య చేసారని తనని సంతకం పెట్టామన్నారని ఆమె తెలిపారు
కడప:వైఎస్ సునీత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(గురువారం) ఆమె జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా పులివెందులలో జరిగుతున్న ఘటనలు చూస్తుంటే నాన్న(వివేకా) హత్య గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రైమ్ సీన్‌ను తుడిచేశారు..
నాన్న గొడ్డలిపోటుతో పడిఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేశారని ఆరోపించారు. హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవిలు హత్య చేసినట్లుగా తనని సంతకం పెట్టామన్నారని తెలిపారు. తాను ఎంత బలవంతం చేసినా సంతకం పెట్టలేదని స్పష్టం చేశారు.అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని ఆరోపించారు. నాన్న(వివేకా)ను టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారని తెలిపారు.
నిందితులు ఇంకా బయటే ఉన్నారు..
తమ బంధువు సురేష్ అనే వ్యక్తిపై దాడి జరిగిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై ఎంపీ అవినాష్ అనుచరులు దాడి చేయించారన్న అనుమానం ఉందని పేర్కొన్నారు. గత 6 ఏళ్ళుగా కేసుపై పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. ఇంత వరకు దోషులకు శిక్ష పడలేదని అసహనం వ్యక్తం చేశారు. నాన్న(వివేకా)ను హత్య తాను, రాజశేఖర్ రెడ్డి కలిసి చేయించారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. హత్య కేసు నిందితులు బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపు నాన్న(వివేకా) పుట్టినరోజు..
రేపు నాన్న(వివేకా) పుట్టినరోజు అని సునీత గుర్తు చేశారు. కానీ తనని తన తల్లి పులివెందులకు రావద్దని చెప్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఏ రోజైనా కచ్చితంగా న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాని ధీమా వ్యక్తం చేశారు. తన మీద, తన భర్త మీద కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టిన, బెదిరించిన భయపడే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని సునీత స్పష్టం చేస్తున్నారు.
అయితే తాజాగా.. వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్‌లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని కొంతమంది ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం