BC Reservation Bill: రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ బిల్లు
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:58 PM
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అలానే 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం కోర్టు మెట్లు ఎక్కింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అలానే 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం కోర్టు మెట్లు ఎక్కింది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై అత్యున్నత న్యాయస్థామైన సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం(Telangana) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం ధర్మాసనం విచారణ చేయనుంద. ఈ పిటిషన్ జస్టిస్ విక్రమ్ నాధ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. బీసీ రిజర్వేషన్లు(BC Reservation) యాభై శాతం దాటాయని చెబుతూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 9ని హైకోర్టు కొట్టివేసింది.
దీంతో త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో హైకోర్టు(Telangana High Court) తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ ఈ కేసును వాదించనున్నారు. ఈ కేసు రేపు విచారణకు వస్తుండటంతో..అక్కడ వచ్చే తీర్పు పైనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. మొత్తంగా తెలంగాణ బీసీ రిజర్వేషన్(BC Reservation Telangana) బిల్లు గరం గరంగా ఉంది. ఈ అంశం చివరికి ఎలా ఉంటుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి:
నామినేషన్ వేసిన తేజస్వి.. గెలుపు మాదేనంటూ ధీమా
బీజేపీ రెండో జాబితా.. అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి