Fish oscar acting: పామును చూసి చేప సూపర్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ కామెంట్లు..
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:38 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతుజాలానికి సంబంధించిన వీడియోలు చాలా మందిని మెప్పిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతుజాలానికి సంబంధించిన వీడియోలు చాలా మందిని మెప్పిస్తున్నాయి. అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నమ్మశక్యం గాని యానిమల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (fish acting viral video).
@gunsnrosesgirl3 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చేప నీటిలో ఈదుతున్నట్లు కనిపిస్తోంది (funny fish video). అప్పుడు ఓ నకిలీ పామును దాని ముందు పెట్టారు. ఆ పామును చూడగానే చేప స్థంభించిపోయింది. కాసేపటి తర్వాత వెనక్కి తిరిగిపోయి చనిపోయినట్టు నటించింది. ఆ పాము తనను దాటి వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆ చేప ముందుకు వెళ్లిపోయింది. అది ఏఐతో రూపొందించిన వీడియో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఏఐతో రూపొందించిన వీడియో అయినా అది చాలా మందికి నవ్వుతెప్పిస్తోంది (fish drama video). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 63 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 83 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలు తెలియజేశారు. ఆ చేప కచ్చితంగా ఆస్కార్ గెలుచుకోవాలి అని ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియోను ఏఐతో రూపొందించినా చాలా ఫన్నీగా ఉందని మరొకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
1638 క్రెడిట్ కార్డులతో గిన్నీస్ రికార్డు.. ఎలా వాడుతున్నాడంటే..
మీ బ్రెయిన్ సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న రెండో మనిషిని కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..