Share News

Credit card collection: 1638 క్రెడిట్ కార్డులతో గిన్నీస్ రికార్డు.. ఎలా వాడుతున్నాడంటే..

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:31 PM

క్రెడిట్ కార్డులు అంటే చాలా మంది భయపడతారు. అవి అప్పుల ఊబిలోకి లాగేస్తాయని అనుకుంటారు. క్రెడిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు తీసుకుంటే.. ఎక్కువగా కట్టాల్సి ఉంటుందని, వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకుంటారు. మరికొందరు మాత్రం క్రెడిట్ కార్డ్‌లను విరివిగా వాడుతుంటారు.

Credit card collection: 1638 క్రెడిట్ కార్డులతో గిన్నీస్ రికార్డు.. ఎలా వాడుతున్నాడంటే..
credit card collection

క్రెడిట్ కార్డులు అంటే చాలా మంది భయపడతారు. అవి అప్పుల ఊబిలోకి లాగేస్తాయని అనుకుంటారు. క్రెడిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు తీసుకుంటే.. ఎక్కువగా కట్టాల్సి ఉంటుందని, వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకుంటారు. మరికొందరు మాత్రం క్రెడిట్ కార్డ్‌లను విరివిగా వాడుతుంటారు. అయితే మనీష్ ధమేజా (Manish Dhameja) అనే ఓ వ్యక్తి మాత్రం క్రెడిట్ కార్డుల వాడకంలో గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు. ఎందుకంటే అతడు ప్రస్తుతం 1638 క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నాడు (1638 credit cards).


క్రెడిట్ కార్డుల వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువగా ఉందని మనీష్ ధమేజా చెబుతున్నాడు. 1600లకు పైగా క్రెడిట్ కార్డులను పొంది వాటిని ఎంచక్కా వాడేస్తున్నాడు. అన్ని క్రెడిట్ కార్డులు ఉన్న మనీష్ ధమేజా అప్పు మాత్రం ప్రస్తుతం సున్నా. దీంతో అతడి వాడకాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డ్స్ (Guinness World Record) సంస్థ గుర్తించింది. మనీష్ దగ్గర ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు 1638 ఉన్నాయి.


వాటిని అతడు కేవలం కలెక్షన్‌గా మాత్రమే ఉంచడం లేదు. తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నాడు. నిత్యావసర సరుకులు, షాపింగ్, మరే వస్తువులు కొనుగోలు చేయాలన్నా క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తాడు (financial discipline). క్రెడిట్ కార్డుల బిల్లులను సమయానికి కట్టేస్తాడు. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా వీటిని నిర్వహిస్తున్నాడు. పైగా బోలెడు లాభాలను అందుకుంటున్నాడు.


క్రెడిట్ కార్డులను తరచుగా వాడడం వల్ల ఆ కార్డులకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, విమాన ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ రూమ్‌ల వంటి కూపన్లు వస్తుంటాయి (Credit card management). వాటిని అవసరానికి వినియోగిస్తుంటాడు. మనీష్ ఏదైనా ట్రిప్‌నకు వెళ్లాలనుకుంటే.. అక్కడ ఉపయోగపడే, ప్రయోజనాలు ఉచితంగా అందించే కార్డులను వెంట తీసుకెళ్లి వాటిని మాత్రమే వినియోగిస్తుంటాడు. అలా క్రెడిట్ కార్డులను తన ప్రయోజనాలకు వాడుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.


ఇవి కూడా చదవండి..

ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చేశాడో చూడండి..


1990లో కిలో బంగారం కొని ఉంటే.. హర్ష్ గోయెంకా ఆసక్తికర ట్వీట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2025 | 05:27 PM