Jugaad video: ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చేశాడో చూడండి..
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:38 PM
మన దేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేకుండా సునాయసంగా పనులు పూర్తి చేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మన దేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేకుండా సునాయసంగా పనులు పూర్తి చేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా టేబుల్ ఫ్యాన్ గాలి సరిగ్గా తగలదు. ఇద్దరు పడుక్కున్నప్పుడు మరీ కష్టం. దీంతో ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్ ఉపయోగించాడు (viral jugaad trick).
@anujd4224 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రేకుల షెడ్‌లో టేబుల్ ఫ్యాన్ ఉంది. దాని ఎదురుగా ఇద్దరు పడుకున్నారు. ఆ ఇద్దరికీ ఫ్యాన్ గాలి సరిగ్గా తగలడం లేదు. దీంతో ఓ యువకుడు తన ప్యాంట్‌ను విప్పి ఆ టేబుల్ ఫ్యాన్‌కు చుట్టేశాడు. ఆ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఫ్యాంట్‌కున్న రెండు కాళ్ల గుండా ఆ ఇద్దరికీ తగులుతోంది. ఆ జుగాడ్ ట్రిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (funny Indian hack).
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (desi innovation). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు లక్షలమంది వీక్షించారు. కొన్ని వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ టెక్నాలజీ ఇండియా దాటి బయటకు వెళ్లకూడదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక, ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది సూపర్ టెక్నిక్ అని మరొకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
స్కూల్ నుంచి పారిపోయాడు.. బుర్జ్ ఖలీఫా వరకు ఎదిగాడు.. సక్సెస్ స్టోరీ..
షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..