Share News

Indian millionaire story: స్కూల్ నుంచి పారిపోయాడు.. బుర్జ్ ఖలీఫా‌ వరకు ఎదిగాడు.. సక్సెస్ స్టోరీ..

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:58 PM

మన దేశం నుంచి ఎంతో మంది వ్యక్తులు మెరుగైన అవకాశాలు, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వలస వెళుతుంటారు. చాలా మంది తమ అవసరాలకు అనుగుణంగా సంపాదించుకుంటారు. కొందరు మాత్రం ఎవరికీ సాధ్యం కాని అద్భుతాలను సృష్టిస్తారు.

Indian millionaire story: స్కూల్ నుంచి పారిపోయాడు.. బుర్జ్ ఖలీఫా‌ వరకు ఎదిగాడు.. సక్సెస్ స్టోరీ..
Dubai success story

మన దేశం నుంచి ఎంతో మంది వ్యక్తులు మెరుగైన అవకాశాలు, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వలస వెళుతుంటారు. చాలా మంది తమ అవసరాలకు అనుగుణంగా సంపాదించుకుంటారు. కొందరు మాత్రం ఎవరికీ సాధ్యం కాని అద్భుతాలను సృష్టిస్తారు. అలాంటి వారిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన సతీష్ సన్పాల్. ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన సతీష్ దుబాయ్‌లో మిలియనీర్‌గా ఎదిగారు (school dropout success).


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సతీష్ ఎనిమిదో తరగతి తర్వాత చదువు మానేసి, తన తల్లి ఇచ్చిన 50,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. కిరాణా కొట్టు పెట్టాడు. అయితే అది విజయవంతం కాకపోవడంతో దానిని రెండేళ్లలోనే మూసేసి దుబాయ్ వెళ్లాడు. ప్రొఫెషనల్ డిగ్రీ లేకపోయినా, అతను తన అభిరుచిని అనుసరించాడు. ఎప్పుడూ ఎవరి కిందా పని చేయకుండా తన సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. సతీష్ 11 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లినప్పుడు, అతనికి అక్కడ ఏమీ తెలియదు (grocery store to millionaire).


మొదట్లో దుబాయ్ స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న పెట్టుబడులతో తన ప్రస్థానం ప్రారంభించాడు. క్లయింట్లు స్టాక్ మార్కెట్ బ్రోకర్లతో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేశాడు. అది సతీష్‌కు ఎంతో ఉపకరించింది. చాలా మందితో పరిచయాలు పెంచింది. 2018లో, సతీష్ అనాక్స్ హోల్డింగ్స్‌ సంస్థను ప్రారంభించాడు. కోవిడ్ సమయంలో సతీష్ తక్కువ విలువ కలిగిన ఆస్తులలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. అది అతడి జీవితాన్ని మార్చేసింది. సంపాదించిన డబ్బును పొదుపు చేసుకుని స్థలాలపై పెట్టుబడి పెట్టాడు (Dubai success story).


స్థలాలపై పెట్టుబడి భారీ లాభాలు ఇవ్వడంతో రియల్ ఎస్టేట్, లగ్జరీ గడియారాలు, బంగారం, కార్లలో పెట్టుబడులు పెట్టి తన సంపదను పెంచుకున్నాడు (rags to riches). అతడు ప్రారంభించిన అనాక్స్ హోల్డింగ్స్ సంస్థ.. అనాక్స్ డెవలప్‌మెంట్స్, అనాక్స్ హాస్పిటాలిటీ, అనాక్స్ క్యాపిటల్‌గా వృద్ధి చెందింది. ప్రస్తుతం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో తన కుటుంబంతో నివసిస్తున్న సతీష్‌కు లగ్జరీ కార్లు మరియు ఒక పడవ ఉన్నాయి. అతని సంస్థ ప్రస్తుతం దుబాయ్‌తో పాటు యూకేలో కూడా పలు వెంచర్లు చేపట్టింది.


ఇవి కూడా చదవండి..

అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..


పాము అంటే పులికీ భయమే.. ఎలా వెనకడుగు వేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2025 | 04:34 PM