Gold price 1990 to 2025: 1990లో కిలో బంగారం కొని ఉంటే.. హర్ష్ గోయెంకా ఆసక్తికర ట్వీట్..
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:11 PM
బంగారం ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తుండడంతో పసిడి ధర పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధరలు ఏకంగా 64 శాతం పెరిగాయి.
బంగారం ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తుండడంతో పసిడి ధర పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధరలు ఏకంగా 64 శాతం పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1, 28, 000కు పైనే ఉంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 అక్టోబర్ నెలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.75, 300గా ఉండేది. ఒక్క ఏడాదిలోనే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు (gold price debate 2025).
ప్రస్తుతం సామాన్య ప్రజల నుంచి దిగ్గజ వ్యాపారవేత్తల వరకు బంగారం గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా బంగారం ధర గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. గత 30 ఏళ్లలో బంగారం ధర ఎంత వేగంగా పెరిగిందో హర్ష్ గోయెంకా వివరించారు. బంగారం ధరలు ఇదే వేగంతో పెరిగితే 2030 నాటికి 1 కిలో బంగారం రోల్స్ రాయిస్ కారు విలువకు సమానమవుతుందని అన్నారు. 1990లో, కిలో బంగారంతో మారుతి 800 కారు మాత్రమే వచ్చేదని అన్నారు (Harsh Goenka gold post).
'ఒక కిలో బంగారం.. 2030 లో అది రోల్స్ రాయిస్ విలువకు సమానం కావచ్చు. 2040 లో బహుశా ఒక ప్రైవేట్ జెట్ విలువకు సమానం కావచ్చు' అని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. కాలం మారుతున్న కొద్దీ కిలో బంగారం ధర ఎలా పెరిగిందో ఆయన వివరించారు (gold rate history).
1990: 1 కిలో బంగారం = మారుతి 800
2000: 1 కిలో బంగారం = ఎస్టీమ్
2005: 1 కిలో బంగారం = ఇన్నోవా
2010: 1 కిలో బంగారం = ఫార్చ్యూనర్
2019: 1 కిలో బంగారం = బీఎమ్‌డబ్ల్యూ కారు
2025: 1 కిలో బంగారం = ల్యాండ్ రోవర్
ఇవి కూడా చదవండి..
స్కూల్ నుంచి పారిపోయాడు.. బుర్జ్ ఖలీఫా వరకు ఎదిగాడు.. సక్సెస్ స్టోరీ..
షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..