Dangerous stunt: రీల్ ముఖ్యం.. ప్రాణాలు కాదు.. ఇద్దరు కుర్రాళ్ల డేంజరస్ స్టంట్ చూడండి..
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:41 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రజల జీవితాలను శాసిస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తపన చాలా మందిలో పెరుగుతోంది. ఏదో ఒకటి చేసి వ్యూస్, లైక్స్ తెచ్చుకోవాలనుకునే వారు పెరుగుతున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రజల జీవితాలను శాసిస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తపన చాలా మందిలో పెరుగుతోంది. ఏదో ఒకటి చేసి వ్యూస్, లైక్స్ తెచ్చుకోవాలనుకునే వారు పెరుగుతున్నారు. అందుకోసం కొందరు తమ ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టి వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో కొందరు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవకతప్పదు (viral reel stunt).
@Jimmyy 02 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు కుర్రాళ్లు ప్రధాన రహదారిపై బైక్‌తో వేగంగా వెళుతున్నారు (people risking lives for reels). రైడర్ ఆ బైక్‌ను వేగంగా నడుపుతున్నాడు. బైక్‌ను నేరుగా ట్రక్కు వెనుక నడుపుతున్నాడు. వేగంగా వెళ్తున్న ఆ బైక్‌ను అటూ ఇటూ తిప్పుతున్నాడు. వారిద్దరూ హెల్మెట్ ధరించలేదు. బైక్ నడుపుతున్న వ్యక్తి ట్రక్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా వారిద్దరూ తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Dangerous stunts video). 83 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి వారికి బతికే అర్హత లేదని ఒకరు అగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మీద పడిన తర్వాత వీరికి జ్ఞానం వస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి వారి లైసెన్స్ రద్దు చేయాలని మరొకరు సూచించారు.
ఇవి కూడా చదవండి..
1638 క్రెడిట్ కార్డులతో గిన్నీస్ రికార్డు.. ఎలా వాడుతున్నాడంటే..
మీ బ్రెయిన్ సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న రెండో మనిషిని కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..