Share News

Rohit Sharma: ధోని, కోహ్లీ చేయలేదు.. 17 ఏళ్ల తర్వాత రోహిత్‌ సై

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:47 PM

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ ఫీట్ నమోదు చేశాడు. 17 ఏళ్లలో లెజెండ్ మహేంద్ర సింగ్, కింగ్ విరాట్ కోహ్లీ చేయలేదు. అలాంటి పని హిట్‌మ్యాన్ చేస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: ధోని, కోహ్లీ చేయలేదు.. 17 ఏళ్ల తర్వాత రోహిత్‌ సై
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకున్నాడు. హెల్మెట్ నెత్తిన పెట్టుకొని అందులోని నుంచి బౌలర్లను ఉరిమి చూస్తున్నాడు. చేతికి గ్లౌజ్ వేసుకొని బ్యాట్‌ను ఝళిపిస్తున్నాడు. డిఫెన్స్‌ను మెరుగుపర్చుకుంటూనే.. తనదైన స్ట్రోక్‌ప్లేతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌కు దిగిన ప్రతి బౌలర్‌ను బాదిపారేస్తున్నాడు. ముంబై జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇదే హైలైట్‌గా మారింది. ఆ టీమ్ తరఫున బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు హిట్‌మ్యాన్. 17 ఏళ్లలో దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని, కింగ్ విరాట్ కోహ్లీ చేయని పని రోహిత్ చేస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


అడుగు దూరంలో..!

రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు రోహిత్ శర్మ. ముంబై జట్టు ట్రెయినింగ్ సెషన్‌లో జాయిన్ అయిన హిట్‌మ్యాన్ తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. అసలే ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో దారుణ ప్రదర్శనలతో తీవ్ర విమర్శలపాలయ్యాడు. దీనికి తోడు రిటైర్మెంట్, కొత్త కెప్టెన్ అంటూ టీమిండియా గురించి, అలాగే రోహిత్ కెరీర్‌పై అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటికీ ఒక్క పెర్ఫార్మెన్స్‌తో సాలిడ్ ఆన్సర్ ఇవ్వాలని అతడు డిసైడ్ అయ్యాడు. రంజీల్లో అదరగొట్టి తన బ్యాట్ పవర్ తగ్గలేదని ప్రూవ్ చేసే పనిలో పడ్డాడు. ఇదే క్రమంలో అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. 17 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్న టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ నిలవనున్నాడు.


బీసీసీఐ నిబంధన!

జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌కు రెడీ అవుతున్నాడు రోహిత్. ఈ మ్యాచ్‌తో దశాబ్దంన్నర తర్వాత రంజీ క్రికెట్ ఆడిన భారత సారథిగా అతడు నిలవనున్నాడు. లెజెండ్ ధోని, మాజీ కెప్టెన్ కోహ్లీ గత 17 ఏళ్లలో రంజీల్లో ఆడలేదు. మూడు ఫార్మాట్లలో ఆడుతూ బిజీగా ఉండటం, ఐపీఎల్‌లోనూ ఆడాల్సి రావడం, మధ్యలో రెస్ట్ తీసుకోవడం.. తదితర కారణాల వల్ల వాళ్లిద్దరూ దేశవాళీలకు దూరమయ్యారు. అయితే బ్యాటర్ల ఫెయిల్యూర్, టీమ్ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్న ప్రతి ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనంటూ ఇటీవల కఠినమైన నిబంధన తీసుకొచ్చింది బీసీసీఐ. దీంతో హిట్‌మ్యాన్ రంజీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు.


ఇదీ చదవండి:

మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం

ఎడ్డం అంటే తెడ్డం.. రోహిత్-గంభీర్ కొట్లాట..

కర్ణాటక పాంచ్‌ పటాకా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 04:08 PM