Share News

Vijay Hazare Trophy : కర్ణాటక పాంచ్‌ పటాకా

ABN , Publish Date - Jan 19 , 2025 | 05:43 AM

టోర్నీ ఆసాం తం అదరగొట్టిన కర్ణాటక ఫైనల్లోనూ అదే జోరును కనబరచి విజయ్‌ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. రవిచంద్రన్‌ స్మరణ్‌ (92 బంతుల్లో 101) శతకంతో కదం తొక్కడంతో శనివారం జరిగిన ఫైనల్లో మయాంక్‌ అగర్వాల్‌

 Vijay Hazare Trophy : కర్ణాటక పాంచ్‌ పటాకా

ఐదోసారి విజయ్‌ హజారే టైటిల్‌

ఫైనల్లో విదర్భ చిత్తు

వడోదర: టోర్నీ ఆసాం తం అదరగొట్టిన కర్ణాటక ఫైనల్లోనూ అదే జోరును కనబరచి విజయ్‌ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. రవిచంద్రన్‌ స్మరణ్‌ (92 బంతుల్లో 101) శతకంతో కదం తొక్కడంతో శనివారం జరిగిన ఫైనల్లో మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలోని కర్ణాటక 36 పరుగులతో విదర్భపై నెగ్గింది. తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 348/6 స్కోరు చేసింది. అభినవ్‌ (79), శ్రీజిత్‌ (78) సత్తా చాటారు. ఛేదనలో విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్‌ షోరే (110) సెంచరీతో పోరాడాడు. చివర్లో దూబే (63) ఆశలు రేపాడు. అయితే అభిలాష్‌ అతడిని అవుట్‌ చేసి కర్ణాటకకు ఊరట నిచ్చాడు.

సంక్షిప్తస్కోర్లు: కర్ణాటక: 50 ఓవర్లలో 348/6 (స్మరణ్‌ 101, అభినవ్‌ 79, కృష్ణన్‌ 78, దర్శన్‌ 2/67, నచికేత్‌ 2/70); విదర్భ: 50 ఓవర్లలో 312 ఆలౌట్‌ (ధ్రువ్‌ 110, దూబే 63, కౌశిక్‌ 3/47, అభిలాష్‌ 3/58, ప్రసిద్ధ్‌ 3/84).

Updated Date - Jan 19 , 2025 | 05:43 AM