Cricket Desi Jugad: నీటిపై పిచ్.. వీళ్ల క్రికెట్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:18 AM
కొందరు యువకులు కలిసి క్రికెట్ ఆడాలని ఫిక్స్ అయ్యారు. అయితే వర్షాకాలం కావడంతో ఎక్కడా స్థలం దొరకలేదు. ఎక్కడ చూసినా బురద, నీరు కనిపిస్తుండడంతో క్రికెట్ ఆడేందుకు వీలు లేకుండా పోయింది. అయినా వీళ్లు మాత్రం ఎలాగైనా ఆడితీరాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా..

క్రికెట్ అంటే యువతలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా బ్యాట్, బంతి తీసుకు మైదానంలో ప్రత్యక్షమవుతుంటారు. ఒకవేళ ఆడటానికి స్థలం లేకపోయినా.. క్రియేట్ చేసి మరీ క్రికెట్ ఆడుతుంటారు. ఇలాంటి సమయాల్లో క్రికెట్ అభిమానుల తెలివితేటలు మామూలుగా ఉండవు. కంప చెట్లను శుభ్రం చేయడం, గుట్టలు.. రాళ్లను చదును చేయడం.. ఇలా ఎలాంటి సాహసానికైనా వెనుకాడరు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘పిచ్ చూస్తే.. పిచ్చెక్కిపోద్ది’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులంతా కలిసి క్రికెట్ ఆడాలని ఫిక్స్ అయ్యారు. అయితే వర్షాకాలం కావడంతో ఎక్కడా స్థలం దొరకలేదు. ఎక్కడ చూసినా బురద, నీరు కనిపిస్తుండడంతో క్రికెట్ ఆడేందుకు వీలు లేకుండా పోయింది. అయినా వీళ్లు మాత్రం ఎలాగైనా ఆడితీరాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా చెరువులోని నీటిపైనే క్రికెట్ ఆడి తమ సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు.
అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఇందుకోసం ముందుగా కనిపించిన ఖాళీ వాటర్ బాటిల్స్ అన్నింటినీ సేకరించారు. తర్వాత వాటిని పొడవాటి కర్రలకు చుట్టూ కట్టిపెట్టేశారు. ఇలా చాలా కర్రలకు వాటర్, జ్యూస్ బాటిల్లను కట్టేసి సిద్ధంగా ఉంచుకున్నారు. ఆ తర్వాత వాటిని వరుసగా (cricket pitch set up on water) పేర్చి వాటిపై మ్యాట్ పరిచారు. చివరగా దాన్ని నీటిపైకి తీసుకెళ్లారు. ఫైనల్‌గా చూస్తే అచ్చం నీటిపై తేలే క్రికెట్ పిచ్‌లా రెడీ చేసేశారు. ఫీల్డర్స్ పిచ్ చుట్టూ నీటిలో నిలబడ్డారు. ఆ తర్వాత యథావిధిగా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు.
ఇలా పిచ్ లేకున్నా కూడా నీటి పైనే క్రికెట్ ఆడేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘నీటిపై క్రికెట్.. వీళ్ల టాలెంట్ మామూలుగా’.. అంటూ కొందరు, ‘ఇది కదా క్రికెట్ అంటే.. వీళ్ల తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి