Fish Viral Video: ఇదేంటీ మరీ విరుద్ధంగా ఉందే.. చేపను నీటిలోకి వేయగానే.. ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jul 06 , 2025 | 07:53 AM
ఓ చెరువు గట్టున ఓ చేప హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి చేతిలోకి తీసుకుని నీటిలో పడేశాడు. ఇలా చేయగానే ఏ చేప అయినా రయ్యిన నీటిలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ చేప మాత్రం ఇలా నీటిలోకి వేయగానే..

ప్రకృతి ఎంతో విచిత్రమైనది. ఎన్నో జీవరాశులతో కూడిన ఈ సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మనుషులు నీటిలో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు.. అలాగే చేపలు నేలపై జీవించడం అసాధ్యం. కానీ కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గట్టున ఉన్న ఓ చేపను నీటిలో వేయగానే ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చెరువు గట్టున ఓ చేప హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి చేతిలోకి తీసుకుని నీటిలో పడేశాడు. ఇలా చేయగానే ఏ చేప అయినా రయ్యిన నీటిలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ చేప మాత్రం ఇలా నీటిలోకి వేయగానే.. అలా బయటికి దూసుకొచ్చింది.
ఇలా ఎన్నిసార్లు నీటిలో పడేసినా వెంటనే గట్టుకు వచ్చి చేరుతోంది. గట్టుపై కొన్ని నిముషాలు కూడా ఉండలేని చేప (Fish) .. ఇలా విచిత్రంగా నీటిలో వేసినా కూడా మళ్లీ ఒడ్డుకు వచ్చి చేరడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే నీటిలో ఏదైనా కాలుష్యం జరిగినా, విష పదార్థాలు కలిసినా చేపలు ఇలా చేస్తాయని పలువురు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ చేప ప్రవర్తన చూపరులు అవాక్కయ్యేలా చేస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ చేప ఏంటీ మరీ విచిత్రంగా ఉందే’.. అంటూ కొందరు, ‘నీటిలో ఏదైనా తేడా జరిగినట్లుంది.. అందుకే చేప ఇలా చేస్తో్ంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 5.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి