Mahanadu: కాలిఫోర్నియాలో మినీ మహానాడు సందడి.. ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు..
ABN, Publish Date - May 27 , 2025 | 11:51 AM
California NRIs Mahanadu: కాలిఫోర్నియాలో ప్రవాసాంధ్రులు తెలుగుదేశం వ్యవస్థాపక అధినేత, నటసార్వభౌముడు, దివంగత నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారైల నేతృత్వంలో ఏర్పాటైన పసుపు పండుగ మినీ మహానాడు సందడిగా జరిగింది.
1/6
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు102వ జయంతి వేడుకలు, మినీ మహానాడు సంబరాలను ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.
2/6
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరవాత మొదటిసారి జరుగుతున్న మహానాడు కార్యక్రమం ఇదే.
3/6
సందడిగా సాగిన మినీ మహానాడులో150 మందికి పైగా అభిమానులు, మహిళలు, చిన్నారులు ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్నారు.
4/6
ప్రముఖ దర్శకులు, సినీ నటులు కాశీవిశ్వనాధ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తలమానికంగా నిలిచిన పుణ్యపురుషుడు తారక రాముడని కొనియాాడారు.
5/6
ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో మినీ మహానాడు సంబరాలు సాగాయి.
6/6
ఈ సందర్భంగా ఎన్నారైలు అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలందరికీ మహానాడు సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నారు.
Updated at - May 27 , 2025 | 12:21 PM