• Home » NRI Photo Gallery

NRI Photo Gallery

యూకేలో లండన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ సమరం.. 15 వారాల పాటు హోరాహోరీ!

యూకేలో లండన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ సమరం.. 15 వారాల పాటు హోరాహోరీ!

లండన్ వేదికగా తెలుగు ఎన్నారైల క్రికెట్ పండుగ షురూ అయింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో 10 జట్లతో TPL 2026 17వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ సమరంతో పాటు ఆరోగ్య స్పూర్తిని రగిలించే 'వన్ మిలియన్ అడుగుల ఛాలెంజ్' కూడా నిర్వహిస్తున్నారు.

Chandrababu: ఇవన్నీ నిజాలు కాదా..? చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ సర్కారును నిలదీసిన ప్రవాసులు

Chandrababu: ఇవన్నీ నిజాలు కాదా..? చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ సర్కారును నిలదీసిన ప్రవాసులు

ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

TANA: 'తానా' ఆదరణ కింద.. మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ..!

TANA: 'తానా' ఆదరణ కింద.. మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ..!

తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్‌.వి.ఎస్‌ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పుట్టగుంట సురేష్‌' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేతుల మీదుగా అందజేశారు.

Saudi: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం..!

Saudi: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం..!

సౌదీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మరో ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం, హసన్ అక్కడికక్కడే మరణించారు. మరో విద్యార్థి అమ్మార్ పరిస్ధితి విషమంగా ఉంది. కాగా.. అమ్మార్, ఇబ్రహీంలు అన్నాదమ్ముళ్లు కావడం గమనార్హం. ఇబ్రహీం గురువారం హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది.

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.

Tramadol Tablets: సౌదీలో తెలుగు యువకుడి బ్యాగ్‌లో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్.. డాక్టర్లే వాడమన్నారన్నా వినని అధికారులు.. చివరకు..

Tramadol Tablets: సౌదీలో తెలుగు యువకుడి బ్యాగ్‌లో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్.. డాక్టర్లే వాడమన్నారన్నా వినని అధికారులు.. చివరకు..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసుపల్లి రాంబాబు అనే ఓ తెలుగు యువకుడు సౌదీలో జైలు పాలయ్యాడు. భారత్‌లోని డాక్టర్లు వాడమన్న ట్రామాడోల్ ట్యాబ్లెట్‌ను సౌదీకి వెళ్లినా వాడుతోంటే.. ఆ మాత్రలే అతడిని జైలు పాలు చేశాయి. ఆ తర్వాత అతడిని బెయిల్ పై విడుదల చేసినా.. సౌదీ దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో అతడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్ సాయంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమయింది.

Gulf News: సౌదీలో మూత పడ్డ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది భారతీయులకు తెలుగు ప్రవాసుల ఆపన్నహస్తం..!

Gulf News: సౌదీలో మూత పడ్డ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది భారతీయులకు తెలుగు ప్రవాసుల ఆపన్నహస్తం..!

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ భారతీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు.

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్.. గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రవాసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు.

Saudi Arabia: సౌదీ పర్యటనలో కేంద్ర మంత్రి మురళీధరన్.. సమస్యలను ఏకరువు పెట్టిన తెలుగు ప్రవాసులు

Saudi Arabia: సౌదీ పర్యటనలో కేంద్ర మంత్రి మురళీధరన్.. సమస్యలను ఏకరువు పెట్టిన తెలుగు ప్రవాసులు

సొంతూరికి తీసుకెళ్లాల్సిన ప్రవాస భారతీయుడి మృతదేహం గురించి ఒకరు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన బకాయిల గురించి మరొకరు.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌తో సమస్యలను చెప్పుకున్నారు.

Sr.NTR Satha Jayanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్నారైల సమక్షంలో మహానాడు..!

Sr.NTR Satha Jayanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్నారైల సమక్షంలో మహానాడు..!

ఎన్టీఆర్ జన్మదినాన్ని ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి