TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2023-05-25T11:04:54+05:30 IST

అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగబోయే ఈ తానా మహాసభలకు ఆహ్వానించేందుకు.. నందమూరి బాలకృష్ణను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు కలిశారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన బాలకృష్ణ, 2022వ సంవత్సరం డిసెంబర్‌లో బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని తానా ద్వారా అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మహాసభలకు తప్పకుండా వస్తానని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Tana-2.jpg

కాగా, ఈ మహాసభలకు బాలయ్య రాక ప్రవాస తెలుగువారందరికీ మంచి అనుభూతిని కలిగిస్తుందని 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలియజేశారు. ఎన్టీఆర్‌ శతవసంతోత్సవ సమయంలో జరుగుతున్న ఈ మహాసభలకు బాలకృష్ణ రావడం.. నాటి ఎన్టీఆర్‌ అభిమానులను మరింతగా సంతోషపెడుతోందని అభిప్రాయపడ్డారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకలకు వచ్చేందుకు సమ్మతించిన బాలకృష్ణకు, ఆయన సతీమణి వసుంధరకు తానా బోర్డ్‌ సభ్యుడు జాని నిమ్మలపూడి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తానా వేడుకలకు బాలకృష్ణ హాజరవుతున్నట్టు తెలియజేసే ప్రత్యేక టీజర్‌ను పార్లమెంట్‌ సభ్యుడు రామ్మోహన్‌ నాయుడు చేతుల మీదుగా ఇటీవల విడుదల చేశారు.

Updated Date - 2023-05-25T11:04:54+05:30 IST