TDP Supporters in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్, కోడెలకు ఘన నివాళి
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:46 PM
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరామ్ అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, దివంగత నేత కోడెల శివప్రసాదరావులకి ఘన నివాళులు అర్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరామ్ (Kodela Shivaram) అమెరికాలోని అట్లాంటా (Atlanta) రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao), దివంగత నేత కోడెల శివప్రసాదరావు (Kodela Shivaprasad Rao) లకి ఘన నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో కోడెల శివరామ్, కూటమి అభిమానులు, కోడెల శివప్రసాదరావు కుటుంబ ఆత్మీయులు పాల్గొన్నారు. అనంతరం అట్లాంటాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోడెల శివరామ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CMChandrababu Naidu), ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పనితీరు, కూటమి నాయకుల సంయుక్త పాలనపై ఈ సమావేశంలో ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన పీ4 కార్యక్రమంపై ఎన్‌ఐఆర్‌ల స్పందన చూసి ప్రతి ఒక్కరూ జన్మ భూమికి అండగా నిలవాలని కోరారు. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన, అభివృద్ధి సమయంలో నాన్న (డాక్టర్ కోడెల శివప్రసాదరావు)కి ఎన్‌ఐఆర్‌లు అందించిన సహకారాన్ని ఎన్నోసార్లు తనతో ప్రస్తావించారని కోడెల శివరామ్ గుర్తుచేసుకున్నారు.

ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యుల్లా ఎన్‌ఐఆర్‌లు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మీ అందరి చిరునవ్వుల్లో నాన్న(కోడెల శివప్రసాదరావు) తనకు కనిపిస్తారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత దేశంలో అమ్మ, నాన్నతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూడా ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన పీ4 కార్యక్రమంలో పాల్గొని ఏపీ అభివృద్ధిలో ఎన్‌ఐఆర్‌లు పాలుపంచుకొని మాతృ భూమి సేవలో ఒక సైనికుడిలా పాల్గొనాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమలో అట్లాంటా రాష్ట్రంలోని టీడీపీ, డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మీయులు, తానా సభ్యులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి
అమెరికాలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపునకు ఘన సన్మానం
లీడ్స్ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
For More NRI News And Telugu News