Ranya Rao: అక్రమ బంగారం రవాణా కేసు.. నటి రన్యా రావుకు రూ.102 కోట్ల జరిమానా..
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:34 PM
కన్నడ నటి రన్యా రావు 127.3 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డిఆర్ఐ రూ.102.55 కోట్లు జరిమానా చెల్లించాలని ఆమెకు నోటీసు జారీ చేసింది.
అక్రమ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన రన్యారావు(Ranya Rao)కు ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) షాకిచ్చింది. దర్యాప్తులో రన్యా రావు 127.3 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో రూ.102.55 కోట్ల జరిమానా చెల్లించాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయ విచారణ అనంతరం DRI అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు. రన్యా సహా మొత్తం నలుగురు నిందితులకు కలిపి రూ.270 కోట్లు జరిమానా విధించినట్టు అధికారులు వెల్లడించారు.
జైల్లోనే నోటీసులు అందజేత
న్యాయ విచారణ తర్వాత DRI అధికారులు రన్యారావుకు జైల్లోనే నోటీసులు అందజేశారు. 102.55 కోట్ల పెనాల్టీ చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటీసు ద్వారా హెచ్చరించారు. అలాగే రన్యాతో సహా మరో నలుగురు నిందితులకు జైల్లోనే నోటీసులు ఇచ్చారు. సోమవారం (సెప్టెంబర్ 2)న విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారించింది. రన్యా రూ.102.55 కోట్లు, తరుణ్ కొండూర్ రాజు రూ.62 కోట్లు, భరత్ జైన్, సాహిల్ జైన్ లు ఒక్కొక్కరు రూ.53 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
ఈ ఏడాది మార్చి మొదటి వారంలో రన్యా రావు దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.డీఆర్‌ఐ అధికారులు ఆమె దగ్గర నుంచి 14.3 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అనంతరం నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..
ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..
For More National News