Share News

CM Chandrababu: ప్రతి 50 కిలోమీటర్స్‌‌కి ఒక పోర్ట్..

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:13 PM

ఏపీలో భవిష్యత్తులో.. ఎయిర్‌పోర్ట్స్, పోర్టులు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్స్‌‌కి ఒక పోర్ట్.. నిర్మించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీ ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో చాలా స్ట్రాంగ్‌గా ఉందని వివరించారు.

CM Chandrababu: ప్రతి 50 కిలోమీటర్స్‌‌కి ఒక పోర్ట్..

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లాజిస్టిక్‌ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌‌మెంట్ తీసుకోస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్‌ లాజిస్టిక్స్‌ పెరుగుతాయని పేర్కొన్నారు. రోడ్ల అనుసంధానం జరిగినట్లు నదులను కూడా కలపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇవాళ ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) విశాఖ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఈస్ట్‌ కోస్ట్‌ మారీటైమ్‌ లాజిస్టిక్స్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు. దక్షిణాదిలో ఏపీ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.


ఏపీలో భవిష్యత్తులో.. ఎయిర్‌పోర్ట్స్, పోర్టులు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్స్‌‌కి ఒక పోర్ట్.. నిర్మించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీ ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో చాలా స్ట్రాంగ్‌గా ఉందని వివరించారు. ముల్లర్ మార్క్‌‌తో పోర్ట్, కార్గో రంగాలపై ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు. షిప్ బిల్డింగ్‌‌లో ఇండియా వెనకంజలో ఉందన్నారు. షిప్స్ నిర్మాణం చేపట్టడానికి రాష్ట్రంలో మూడు, నాలుగు ఏరియాలను ఏర్పాటు చేసినట్ల చెప్పారు. ఎవరైనా ముందుకు వస్తే కలిసి పనిచేస్తామని ఆహ్వానం పలికారు. పోర్ట్ ఆధారిత ఎకానమీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పనులు ప్రారంభించిదని చెప్పారు.


అలాగే.. రాష్ట్రంలో డిఫెన్స్, మెరైన్ షిప్ బిల్డింగ్, కంటైనర్ టెర్మినల్స్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మంచి ప్రతిపాదనతో వచ్చే వారితో కలిసి పని చేస్తామని తెలిపారు. వయబిలిటీ ఫండింగ్ ద్వారా.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. లాంగ్ టర్మ్ పార్టనర్స్ లాంగ్ టర్మ్ ప్లాంట్‌తో రావాలని సూచించారు. విశాఖలో డేటా సెంటర్ వస్తుందన్నారు. డేటాకు వైజాగ్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీని జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని లాస్టిక్ హబ్‌‌గా మార్చేందుకు.. ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఆరు నెలలో మరో సమావేశం విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్‌ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు

250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

Updated Date - Sep 02 , 2025 | 06:22 PM