Share News

Trump On Indo-Pak Jet Clash: పాకిస్థాన్ 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసింది.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ABN , Publish Date - Sep 04 , 2025 | 07:09 PM

'వద్దన్నా వినకుండా పాకిస్థాన్‌తో కయ్యానికి కాలు దువ్వింది భారత్. ఆరు ఫైటర్ జెట్లను కూల్చేయడంతో మా వద్దకు కాల్పుల విరమణ ఒప్పందం చేయమని కాళ్లబేరానికి వచ్చిందంటూ' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియో నిజమా? నకిలీనా? అనే సందేహాలు నెటిజన్లలో..

Trump On Indo-Pak Jet Clash: పాకిస్థాన్ 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసింది.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!
Trump Claim on India Losing Jets in Pak Clash

పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య చెలరేగిన వివాదం సద్దుమణిగేలా చేసింది నేనే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాడు. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం ప్రమేయం లేదని స్వయంగా భారత ప్రధాని మోదీ ఖండించినప్పటికీ తోచినప్పుడల్లా నేనే శాంతిదూత అనేస్తుంటారు అగ్రరాజ్యాధినేత. అయితే, ఇటీవల ఇండియా-పాకిస్థాన్ వివాదంపై ట్రంప్ మాట్లాడిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. అందులో పదే పదే హెచ్చరించినప్పటికీ వినకుండా పాకిస్థాన్‌తో గొడవ పెట్టుకుని అనవసరంగా 6 ఫైటర్ జెట్లను ఇండియా కోల్పోయిందని వ్యాఖ్యానించాడు.


అమెరికా అధినేత ట్రంప్ ఇండియాపై చేసిన హాట్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పహల్గామ్ దాడి అనంతరం భారత్-పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు తాను ఎలా ఫుల్ స్టాప్ పెట్టిందీ ఆయన అందులో ఇలా వివరించాడు. 'వద్దన్నా వినకుండా ఇండియా పాకిస్థాన్‌తో పెట్టుకుంది. ఆ తర్వాత నేనేం పట్టించుకోలేదు. తర్వాత పాక్ ఇండియాకు చెందిన 6 ఫైటర్ జెట్లను తునాతునకలు చేసింది. దీంతో శత్రుదేశం నుంచి మమ్మల్ని కాపాడండి.. యుద్ధాన్ని ఎలాగైనా ఆపండంటూ భారత్ మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు నేను జోక్యం చేసుకుని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌తో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేలా చేశా. అలా ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-భారత్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు చల్లారాయంటూ' చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.


ట్రంప్ మాట్లాడిన ఈ వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదంతా ట్రాష్ అని తేల్చేసింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా డీప్ ఫేక్ క్రియేషన్ అని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు అలాంటి ప్రకటన చేయలేదని ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్‌లో పేర్కొంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా PIB పోస్ట్‌ను రీపోస్ట్ చేసింది. పాకిస్థాన్ నుంచి కొందరు ఫేక్ ఖాతాల ద్వారా ఈ నకిలీ వీడియో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

పోలీస్ స్టేషన్లలో పని చేయని సీసీటీవీ కెమెరాలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 04 , 2025 | 07:55 PM