AP BJP Chief: జీఎస్టీ సులభతరం.. ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షం
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:40 PM
నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
మచిలీపట్నం, సెప్టెంబర్ 04: నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని ముందుకెళుతుందన్నారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్య తరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతోందన్నారు. దీని వల్ల చిరు వ్యాపారులు, రైతులకు ఎంతో ఊరట లభించనుందని చెప్పారు.
బందరులో తొలి జనసంఘ్ సమావేశం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మచిలీపట్నం బిజేపీ బలంగా ఉన్న ప్రాంతమని.. అందువల్ల మనం శక్తి ప్రదర్శించే సమయం ఆసన్నమైందన్నారు. విదేశీ కూల్ డ్రింక్స్ బహిష్కరించి.. బందరు బాదం మిల్క్ తాగాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా స్వదేశీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్య్సకారులను ఆదుకుంటుందని.. ఆందోళ చెందవద్దంటూ వారికి ఆయన హామీ ఇచ్చారు. అలాగే మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ వస్తువుల మార్కెటింగ్‌కు ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు.
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో మాట్లాడుతూ..జీఎస్టీ తగ్గించటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రూ. 48 వేల కోట్ల బారం పడుతుందన్నారు. యూరియా సరఫరాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. యూరియా విషయంలో రైతులకు ఇబ్బందులు ఉంటే తాము వెంటనే స్పందిస్తామని స్పష్టం చేశారు. యూరియా అంశంలో వైసీపీ నేతలు దోపిడీ దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వీఐపీ పాసులు జారీ చేసే దుస్థితికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దిగజారారంటూ వ్యంగ్యంగా అన్నారు. ప్రదాని మోదీ తల్లిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..
For More AP News And Telugu News