Share News

GATE 2026 Registration: గేట్ 2026 రిజిస్ట్రేషన్ స్టార్ట్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Sep 04 , 2025 | 06:45 PM

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) పరీక్షకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.

GATE 2026 Registration: గేట్ 2026 రిజిస్ట్రేషన్ స్టార్ట్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
GATE 2026 Registration Open Until September 28

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీల్లో 2026-27 సంవత్సరానికి గాను ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ టెస్ట్‌కు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజైంది. ఇండియన్ ఇన్సి‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువాహటి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) షెడ్యూల్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. గేట్ 2026 కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2025. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


గేట్ 2026 కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2025. అయినప్పటికీ, అభ్యర్థులు లేట్ ఫీజు చెల్లించి అప్లై చేసుకునే సదుపాయం ఉంది. వీరికి అక్టోబర్ 9, 2025 వరకు విండో ఓపెన్లో ఉంటుంది. ఆలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు చివరి తేదీ: - సెప్టెంబర్ 28, 2025

దరఖాస్తుకు చివరి తేదీ: - అక్టోబర్ 9, 2025 (ఆలస్య రుసుముతో)

పరీక్ష తేదీలు: - 2026 ఫిబ్రవరి 7, 8, 14, 15


గేట్ పరీక్ష నిర్వహణ వివరాలు

గేట్ 2026 పరీక్ష ఫిబ్రవరి 7, 8, 14,15 తేదీల్లో జరుగుతుందని IIT గువాహటి తెలిపింది. ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం సెషన్లో 2:30 నుండి 5:30 వరకు. అడ్మిట్ కార్డులు జనవరి 2, 2026 నుండి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. అలాగే, స్కోర్ కార్డులను అభ్యర్థులు మార్చి 27 నుండి మే 31, 2026 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


పరీక్షలో కొత్త పేపర్

ఈసారి గేట్ 2026లో ఇంజనీరింగ్ సైన్స్ (XE) కింద ఎనర్జీ సైన్స్ అనే కొత్త పేపర్ ప్రవేశపెట్టారు. కానీ, మొత్తం పరీక్షా పేపర్ల సంఖ్య 30గానే ఉంటుంది.

ఫీజు వివరాలు

మహిళా అభ్యర్థులు SC, ST, దివ్యాంగ కేటగిరీలకు సాధారణ ఫీజు రూ. 1,000. ఆలస్య రుసుముతో రూ. 1,500. మిగతా అభ్యర్థులందరికీ ఫీజు రూ. 2,000 (సాధారణ వ్యవధి), రూ. 2,500 (ఆలస్య రుసుముతో కలిపి)


ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ఓపెన్ చేయండి.

  • పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

  • లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ వస్తాయి.

  • రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయి దరఖాస్తు ఫారం ఓపెన్ చేయాలి.

  • వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేదీ, చిరునామా), విద్యార్హత, పరీక్షా కేంద్రం మొదలైనవి ఎంపిక చేసుకోవాలి.

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్‌లను (కేటగిరీ సర్టిఫికెట్, వైకల్య ధృవీకరణ పత్రం మొదలైనవి) అప్‌లోడ్ చేయాలి.

  • దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ మోడ్ ద్వారా పే చేయండి. (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI).

  • ఓసారి చెక్ చేసుకుని ఫారం సబ్మిట్ చేయండి.


ఇవి కూడా చదవండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్..

కొలువుల పండుగ మళ్లీ వచ్చింది.. గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్..

మరిన్ని చదువు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 08:30 PM