Minister Vakiti Srihari: ఎంపీ డీకే అరుణపై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్..
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:44 PM
బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉందో.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో బట్టబయలయ్యిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ వేసింది.. శిక్షించేందుకు కాదని తెలిపారు.
మహబూబ్ నగర్: కాళేశ్వరం అవినీతిపై ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మత్స్య, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. డీకే అరుణ బీఆర్ఎస్‌ను కాపాడేందుకు సీబీఐకి అప్పగించారని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు బీఆర్ఎస్‌కు ఎలాంటి స్నేహం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు..
అయితే.. బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉందో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో బట్టబయలయ్యిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ వేసింది శిక్షించేందుకు కాదని తెలిపారు. కేవలం అక్కడ జరిగిన అక్రమాలను తెలుసుకునేందుకు అని పేర్కొన్నారు. నిజంగా అక్రమాలు జరిగితే.. దోషులను శిక్షించేందుకు మాత్రమే కేసును సీబీఐకి అప్పగించామని ఆయన చెప్పుకొచ్చారు. కేసు విషయంలో చేతకాకపోతే.. వారికి అప్పగిస్తే 48 గంటల్లో తెలుస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని గుర్తు చేశారు. మరి ఇంత కాలం బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. నిజాలు ఎప్పటికైనా బయటకు రాక తప్పదని ఆయన నొక్కిచెప్పారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..