Elon Musk Son Controls Trump : వామ్మో.. ఎంత మాటనేశాడు.. ట్రంప్‌ పరువు తీసిన మస్క్ కొడుకు..

ABN , First Publish Date - 2025-02-14T15:49:42+05:30 IST

Elon Musk Son Controls Trump : కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, నోరు జారడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నైజం. ఎప్పుడేం మాట్లాడినా రచ్చ క్రియేట్ కావడం సర్వసాధారణం. తగ్గేదేలే అంటూ ఎదిరించినవారిని మరించ రెచ్చగొడతాడు. అలాంటి ట్రంప్‌ను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడు X నోరెత్తకుండా చేశాడు. అదీ మీడియా ముందు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Elon Musk Son Controls Trump : వామ్మో.. ఎంత మాటనేశాడు.. ట్రంప్‌ పరువు తీసిన మస్క్ కొడుకు..
Elon Musk's son X bold Comments On Trump

Elon Musk Son X Controls Trump : కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, పదే పదే నోరు జారడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజం. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి ఆ డోస్ మరింత పెంచాడు. వారు వీరు అని తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ప్రతి రోజూ ఏదొకటి మాట్లాడుతూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎదురించినా, భయపెట్టేందుకు ప్రయత్నించినా తగ్గేదేలే అంటూ మాటలతో ఇంకా రెచ్చగొట్టడం సర్వసాధారణంగా మారింది. అలాంటి ట్రంప్‌నే నోరెత్తనీయకుండా చేశాడు టెక్ టైకూన్ మస్క్ కుమారుడు X. అంతర్జాతీయ సమావేశంలో మీడియా ముందే అలా మాట్లాడి ట్రంప్ పరువు తీసేశాడీ బుడ్డోడు..


లిటిల్ X దెబ్బకు అవాక్కు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య వైట్‌హౌస్‌లో సమావేశం జరిగింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలో వహిస్తున్న DOGE, గాజా సమస్యల పై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశారు. అయితే, ఈ అంశం కంటే కంటే సమావేశానికి హాజరైన మస్క్ ముద్దుల కొడుకు ‘ఎక్స్‌ఏఈఏ-12 మస్క్‌’ ( X Æ A-12 ) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. నాలుగేళ్ల 'లిటిల్ X ట్రంప్ పక్కనే కూర్చుని ముక్కులో వేలు పెట్టుకుంటూ, నాన్నని అనుకరిస్తూ విచిత్రమైన చేష్టలతో మీడియా దృష్టిని ఆకర్షించాడు. కాసేపటి తర్వాత ట్రంప్‌ వైపు చూసి X పదే పదే ఈ మాట అనేసరికి అంతా అవాక్కయ్యారు.


ఈ మాటతో ట్రంప్ నోర్మూయించాడు..

అంతా సీరియస్‌గా డోజ్ గురించి డిస్కస్ చేస్తుంటే 'లిటిల్ X మాత్రం అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేశాడు. ట్రంప్ పక్కనే కూర్చుని మాటిమాటికీ "నీ నోరు మూసుకో!" అనటం అందరికీ తమాషాగా అనిపించింది. ఆ తర్వాత నుంచి పదే పదే "నువ్వు అధ్యక్షుడు కాదు. నువ్వు వెళ్లిపోవాలి!" అనటంతో ట్రంప్ ముఖం కోపంతో ఎర్రబడింది. అయినా, తనను తాను నియంత్రించుకుని ఆ పిల్లవాడి మాటలను పట్టించుకోవడం మానేశాడు. ఈ సంఘటనపై మీడియా తీసిన వీడియోలు బయటికి వచ్చాక అది వైరల్‌ అవుతోంది. ట్రంప్‌ను అంత మాటనేసి ఎలా నోర్మూయించాడో చూడండి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే

మా దేశంలో చదువుకోండి.. పని చేసుకోండి!

Dubai: దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చలు..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-02-14T16:21:00+05:30 IST